
దాతృత్వానికి ప్రతీక అగ్నికుల క్షత్రియులని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ అన్నారు. తోకతిప్పలో కొపనాతి కృష్ణమ్మవర్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు. 8లో u
●
ఆరోగ్యశ్రీ ఆదుకుంది
కిడ్నీల్లో రాళ్ల సమస్యకు ఆరోగ్యశ్రీలో ఉచితంగా ఆపరేషన్ చేసి మందులు ఇచ్చారు. ఇంటికి వచ్చాక కూడా ఖర్చులకు రూ.3,500 అకౌంట్‌లో వేశారు. నా కుమారుడికి రోడ్డు ప్రమాదంలో కాలు విరిగిపోతే ఆరోగ్యశ్రీలో ఆదుకున్నారు. ఆసరా, చేయూత, రైతు భరోసా, సున్నావడ్డీ పథకాల సాయం అందుతోంది. గతంలో సర్పంచ్‌గా ఉన్నాను. అప్పటికంటే జగన్ ప్రభుత్వం వచ్చాక అందరికీ బాగుంది.
– బొమ్మిది వెంకటలక్ష్మి, మాజీ సర్పంచ్
అప్పారావుపేట, ఆకివీడు మండలం
మాట ఇచ్చినట్టే రుణమాఫీ
అధికారంలోకి వచ్చాక నాలుగు విడతల్లో డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చెప్పినట్టుగానే జగన్ మా డ్వాక్రా రుణాలను చెల్లిస్తున్నారు. ఎన్నికలకు ముందు మా సంఘం రూ.9.55 లక్షలు రుణం తీసుకుంది. మూడు విడతల్లో రూ.7.10 లక్షలు మాఫీ చేశారు. మిగిలినది త్వరలో మాఫీ చేయనున్నారు. గతంలో రుణమాఫీ పేరుతో చంద్రబాబు వంచిస్తే సీఎం జగనన్న ఇచ్చిన మాటను నిలుపుకున్నారు.
– తమరడ వహీదా, డ్వాక్రా మహిళ,
కొవ్వాడ అన్నవరం, భీమవరం రూరల్
సచివాలయ ఉద్యోగం వచ్చింది
నాకు 20 ఏళ్ల క్రితం వివాహమైంది. భర్త ప్రోత్సాహంతో ప్రైవేట్‌గా డిగ్రీ, ఎంఏ, బీఈడీ చేశాను. ప్రైవేట్ టీచర్‌గా చేస్తూ ప్రభుత్వ ఉద్యోగం కోసం పోటీ పరీక్షలు రాశాను. ఇక అవకాశం లేదనుకుంటున్న సమయంలో సీఎం జగన్ సార్ సచివాలయ వ్యవస్థను తీసుకురావడం నిరుద్యోగులకు వరమైంది. ఈ పరీక్షలు రాసి సచివాలయంలో మహిళ పోలీస్‌గా ఉద్యోగం సాధించాను. చాలా ఆనందంగా ఉంది.
– తాళాబత్తుల సుబ్బలక్ష్మి,
సచివాలయ ఉద్యోగి, నరసాపురం

