భీమవరంలో టెన్నిస్ పోటీల దృశ్యం
సాక్షి, భీమవరం: భీమవరం కాస్మో క్లబ్‌లో నిర్వహిస్తున్న ఆలిండియా టెన్నిస్ టోర్నమెంట్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. పోటీలను క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు అల్లూరి పద్మరాజు, పి.వెంకటరామరాజు, వీవీఎస్‌ఎస్ వర్మ, కె.రాంబాబు పర్యవేక్షించారు. 35 ప్లస్ సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో వి.రామకృష్ణపై ఎన్‌డీ విజయ్ ఆనంద్ విజయం సాధించారు. డాక్టర్ జాన్ రెజినాల్డ్ పై కె.రవికుమార్, కెఎస్‌ఎన్ రాజుపై కె.సంపత్ కుమార్, వై.శ్రీనివాసరెడ్డిపై షానర్ నాయుడు, టి.దత్తుపై ఐ.గిరీష్‌కుమార్ రెడ్డి, భాస్కరరావుపై విజయ్ వర్మ, పి.సుభాష్‌పై పట్నాయక్, కబీర్ నునావత్‌పై నగేష్ విజయం సాధించారు. 45 ప్లస్ సింగిల్స్ ప్రీక్వార్టర్ ఫైనల్స్‌లో సి.సుబ్రహ్మణ్యంపై మణికందన్ గెలుపొందారు. ఎస్‌కే సలీంపై జీవీ రమణ, ఎం.భాస్కర్ నాయుడుపై ఎవీఎల్‌ఎన్ రాజు, నాగరాజుపై పి.సుధీర్ రెడ్డి, ఆర్ నాగరాజుపై సుబ్రహ్మణియన్, ఆర్‌ఎం కుమార్‌పై బాబు రాజా, జి.వెంకటేశ్వర్లుపై మణికన్నె, ఆర్.రాంబాబుపై ఎంఎస్ కిరణ్ గెలుపొందారు. 55 ప్లస్ సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లో ఎ.గజేంద్రనాయుడుపై వి.శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు. కె.ఎన్.కేశవ ప్రసాద్‌పై బి.జి.నగేష్, జి.కన్నన్‌పై ఎ.వెంకటేశ్వర్లు, ఎస్‌ఎస్ రాత్‌పై హేమంత్ కుమార్, చిన్ని సుధాకర్‌పై సుధాకర్‌రెడ్డి, ఎం.మోహిత్ కుమార్ రాజరాంపై సన్యాసి బెసార్త్, కె.పి.రావుపై ఎస్.చంద్రశేఖరరావు, డాక్టర్ శంకర్ రెడ్డిపై ఆర్‌ఎస్ రావత్ విజయం సాధించారు. 65 ప్లస్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఎం.జోయల్ కుమార్‌పై సేతు, సి.విజయ్‌కుమార్‌పై సన్యాసి రాజు, రజాక్‌పై వి.ధనుంజయులు, పాలచంద్రపై తులసీ రాం గెలుపొందారు. 75 ప్లస్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో పి.కె. బాబాపై కె.రాధా కృష్ణమూర్తి, ఎం.సాయి రాంబాబుపై అశోక్ రెడ్డి, బీవీ మంజునాథ్‌పై పి.కె.పట్నాయక్ విజయం సాధించారు.


