ప్రేమ నింపిన విషాదం | - | Sakshi
Sakshi News home page

ప్రేమ నింపిన విషాదం

Oct 13 2026 12:23 AM | Updated on Oct 13 2026 12:23 AM

● పైళ్లెన తర్వాత కూడా

కొనసాగిన బంధం

● పెద్దలు మందలించడంతో

కలుపు మందు తాగి ఆత్మహత్య

పెనుగొండ: పెళ్లి తర్వాత కూడా ప్రేమించిన వారిని మర్చిపోలేక, విడిచి ఉండలేక యువతీయువకులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలంలో చోటుచేసుకుంది. పెనుగొండ ఎస్సై గంగాధర్‌ తెలిపిన వివరాల ప్రకారం... తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ఖండవల్లి గ్రామానికి చెందిన కొండేటి కిషోర్‌ (31), గూడూరి తేజశ్రీ గంగా మహాలక్ష్మి (36) చిన్నతనంలోనే ప్రేమించుకున్నారు. కులాలు వేరు కావడం, ఇతర కారణాలతో వీరి వివాహానికి పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఇద్దరికీ వేర్వేరు వ్యక్తులతో వివాహాలు జరిపించారు. కిషోర్‌కు కాకరపర్రుకు చెందిన కుమారితో వివాహమవ్వగా ఒక బాబు ఉన్నాడు. తేజశ్రీకి తణుకు పరిధిలోని టి.వేమవరానికి చెందిన నాగరాజుతో వివాహమైంది. వీరికి 13 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. పిల్లలు పుట్టినా వీరిద్దరి సాన్నిహిత్యం కొనసాగింది. ఈ విషయం తెలుసుకున్న ఇరు కుటుంబాల పెద్దలు ఇటీవల ఇద్దరినీ హెచ్చరించారు. తమను ఇక కలవనివ్వరని భావించి ఈనెల 10న ఇళ్ల నుంచి వెళ్లిపోయారు. పెనుగొండ మండలం కామధేనువులంకకు చేరుకుని ఆదివారం కలుపుమందు తాగి, విషయాన్ని బంధువులకు ఫోన్‌ చేసి చెప్పారు. బంధువులు 108లో వారిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి వైద్యం అందించారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం కిషోర్‌, సాయంత్రం తేజశ్రీ మృతిచెందారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement