ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పచ్చి మోసకారి. కుటుంబానికి ఎంతో కొంత చేదోడుగా ఉంటామని వలంటీర్ ఉద్యోగంపై ఆధారపడితే అధికారంలోకి రాగానే మమ్మల్ని చెప్పా పెట్టకుండా తొలగించాడు. కరోనా కష్టకాలంలోనూ వలంటీర్లు ప్రజలకు ఎంతో సేవ చేశాం. జీతాలు పెంచుతామని చెప్పిన కూటమి నాయకులు నేడు మమ్మల్ని తొలగించి, ఎటువంటి సమాధానం చెప్పకుండా తిరుగుతున్నారు.
–బండారు రామశివ, మాజీ వలంటీర్, దివిలి, పెద్దాపురం మండలం
నిరుద్యోగ యువతకు వెన్నుపోటు
వలంటీర్లకు రూ.10 వేల వేతనం అందిస్తామని చంద్రబాబు ఎన్నికల ముందు హామీ ఇచ్చి వెన్నుపోటు పొడిచారు. అధికారంలోకి వచ్చాక వలంటీర్లను తొలగించి అన్యాయం చేశారు. ప్రభుత్వ సొమ్ము దుబారా చేస్తూ సోషల్ మీడియాలో సొంత డప్పు కొట్టడానికి ఇన్‌ఫ్లుయెన్సర్లకు డబ్బులు ఇస్తామనడం బాధాకరం. ఇచ్చిన హామీలన్నీ పక్కన పెట్టి, ప్రభుత్వ సొమ్ము పచ్చ నేతలకు దోచిపెడుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో యువకులకు ఉపాధి లభించింది. జగనన్న చొరవతో కరోనా కాలంలోనూ విశేష సేవలు అందించాం. –నైనాల విష్ణువర్ధన్, మాజీ వలంటీర్, ఆత్రేయపురం


