పేదల కోసం సేవా దృక్పథంతో పని చేసిన మమ్మల్ని కూటమి ప్రభుత్వం తొలగించింది. కరోనా సమయంలోనూ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించాం. గత ప్రభుత్వం ఇచ్చిన రూ.5 వేల వేతనాన్ని రూ.10 వేలకు పెంచుతామని కూటమి పెద్దలు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పి, దగా చేశారు. మా పొట్ట కొట్టారు. ఇప్పుడు సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల పేరుతో నిధులు దోచిపెట్టడానికి సిద్ధమవడం దారుణం.
– చొప్పల ప్రవీణ్, మాజీ వలంటీర్, అంతర్వేదిపాలెం, సఖినేటిపల్లి
కార్యకర్తలకు తాయిలాలు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు నజరానాల పేరుతో తమ కార్యకర్తలకు తాయిలాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పథకం వేశారు. గతంలో ఐదేళ్ల పాటు తక్కువ గౌరవ వేతనంతోనే ప్రజలకు ఎంతో సేవ చేశాం. అటువంటి మాకు జీతాలు పెంచుతామని గత ఎన్నికల్లో కూటమి నేతలు వాగ్దానం చేసి, నమ్మించారు. చివరకు మమ్మల్ని అన్యాయంగా ఈ కూటమి ప్రభుత్వం తొలగించింది. మా కుటుంబాలను రోడ్డున పడేసింది.
– బందెల జాన్‌బాబు, మాజీ వలంటీర్, అప్పనరామునిలంక, సఖినేటిపల్లి మండలం


