● నిరీక్షణ.. మూగ వేదన | - | Sakshi
Sakshi News home page

● నిరీక్షణ.. మూగ వేదన

Oct 6 2026 12:12 AM | Updated on Oct 6 2026 12:12 AM

పశు వైద్య శిబిరం అన్నారు.. మూగజీవాలకు వేదన మిగిల్చారు.. జీవహింస సరికాదని చెబుతున్న నేతలే మూడున్నర గంటల పాటు పశువులను నిలబెట్టి ఉంచడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది. రాజమహేంద్రవరం రూరల్‌ హుకుంపేట గ్రామ పంచాయతీ కార్యాలయంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఆధ్వర్యంలో సోమవారం ఉద యం 10 గంటలకు ఉచిత పశువైద్య శిబిరం నిర్వహిస్తామని ముందుగానే ప్రకటించారు. దీంతో పా డి రైతులు ఉదయం తొమ్మిది గంటలకే ఆవులతో గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. దీనికి ముఖ్యఅతిథులైన ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి లు 11 గంటల తరువాత వచ్చారు. తీరా వెంటనే పశు వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తారని పాడి రైతులు భావించారు. అలాకాకుండా ముందుగా సభ నిర్వహించి ముఖ్య అతిథులు మాట్లాడేసరికి మధ్యా హ్నం 12.40 గంటలు అయ్యింది. అనంతరం ఉచిత పశువైద్య శిబిరాన్ని ప్రారంభించారు. శిబిరానికి తీసుకువచ్చిన ఆవులను ఇలా మూడున్నర గంటల పాటు నిలబెట్టి తిండీ తిప్పలు లేకుండా ఉంచడంపై పాడి రైతులు అసహనాన్ని వ్యక్తం చేశారు.

– రాజమహేంద్రవరం రూరల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement