ఎన్నికల ఏర్పాట్లలో అలసత్వం వద్దు | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల ఏర్పాట్లలో అలసత్వం వద్దు

Oct 6 2026 12:12 AM | Updated on Oct 6 2026 12:12 AM

జిల్లా కలెక్టర్‌ కీర్తి చేకూరి

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రతి అంశాన్ని ముందుగానే పరిశీలించి, పటిష్టమైన ప్రణాళికతో సన్నద్ధం కావాలని కలెక్టర్‌ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌ సమావేశ మందిరంలో సమన్వయ శాఖల అధికారులు, మండల స్థాయిలో అధికారులకు జూమ్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ కీర్తి చేకూరి మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలన్నారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయో లేదో పరిశీలించాలని సూచించారు. ప్రతి ఎంపీడీఓ కార్యాలయాల్లో ఎన్నికల నిర్వహణకు సమర్థవంతమైన బందాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ వై.మేఘ స్వరూప్‌, జిల్లా రెవెన్యూ అధికారి ఎస్‌.భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

దాటవేత ధోరణి వీడండి

ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌)కు వచ్చే ప్రతి అర్జీని అధికారులు బాధ్యతతో పరిశీలించాలని, దాటవేత ధోరణి వీడాలని కలెక్టర్‌ కీర్తి చేకూరి ఆదేశించారు. కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌తో పాటు జాయింట్‌ కలెక్టర్‌ వై.మేఘ స్వరూప్‌, డీఆర్వో ఎస్‌.భాస్కర్‌ రెడ్డి, ఇతర జిల్లా అధికారులు అర్జీలను స్వీకరించి, సంబంధిత అధికారులకు పరిష్కారంపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అర్జీదారుల సమస్యలను వేగంగా పరిష్కరించాలన్నారు. పీజీఆర్‌ఎస్‌కు మొత్తం 223 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో రెవెన్యూ క్లినిక్‌కు 104 అర్జీలు రాగా, మిగిలినవి ఇతర శాఖల అర్జీలు. కార్యక్రమంలో ఆర్డీఓలు ఆర్‌.శివరాముడు, కె.ఆనందరావు, ఎస్‌డీసీ పి.భాగ్యలక్ష్మి, డీఎస్పీ ఎ.శివప్రియ, సీపీఓ ఎల్‌.అప్పలకొండ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement