కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి | - | Sakshi
Sakshi News home page

కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలి

Oct 4 2026 9:49 AM | Updated on Oct 4 2026 9:49 AM

కాకినాడ రూరల్‌: కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను తక్షణమే రెగ్యులరైజ్‌ చేయాలని, అది అమలయ్యే వరకు సమాన పనికి సమాన వేతనం అందించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం రాజమహేంద్రవరంలోని రావణం శ్రీరాములు కల్యాణ మండపంలో నిర్వహించే ప్రాంతీయ సదస్సును జయప్రదం చేయాలని సీఐటీయూ నాయకులు పిలుపునిచ్చారు. ఈ మేరకు కాకినాడ రూరల్‌ వలసపాకల కార్యాలయంలో సదస్సుకు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మారుతున్నా కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, ఆప్కాస్‌, ఎన్‌ఎంఆర్‌ గెస్ట్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావడం లేదని సీఐటీయూ మండల కార్యదర్శి తొట్టిపూడి రాజా విమర్శించారు. పంజాబ్‌, ఢిల్లీ, రాజస్థాన్‌ వంటి అనేక రాష్ట్రాల్లో ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఉద్యోగ భద్రతపై సానుకూల నిర్ణయాలు తీసుకున్నారని, మన రాష్ట్రంలో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని, ప్రమాద ఉచిత బీమా, ఆరోగ్య బీమా, కారుణ్య నియామకాలు వర్తింపజేయాలని కోరారు. ప్రతి నెలా మొదటి వారంలోనే జీతాలు చెల్లించాలని, పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

నేడు రాజమహేంద్రవరంలో

ప్రాంతీయ సదస్సు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement