ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమిద్దాం

Oct 4 2026 9:49 AM | Updated on Oct 4 2026 9:49 AM

ప్రకాశంనగర్‌: కార్మికులు పోరాడి సాధించుకున్న చట్టాలు, హక్కులను కాలరాస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ కేంద్ర కమిటీ నాయకురాలు పి.టాన్యా అన్నారు. శనివారం రాజమహేంద్రవరంలోని తాడితోట సంహిత కన్వెన్షన్‌ హాల్‌లో ఐఎఫ్‌టీయూ రాష్ట్ర 9వ మహా సభలు ప్రారంభమయ్యాయి. టాన్యా మాట్లాడుతూ పాలకులు కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు అనుకులమైన అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలను చేసుకుంటూ, భారత ఉత్పత్తులపై తీవ్ర ప్రభావాన్ని పడేస్తున్నారన్నారు. జీరో సుంకానికి 500 వస్తువులు దిగుమతి చేసుకోవడం ద్వారా భారత కుటీర పరిశ్రమలు దెబ్బతిని, కార్మికులు రోడ్డున పడే పరిస్థితి రాబోతుందన్నారు. 4 లేబర్‌ కోడ్లకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్‌) కేంద్ర ప్రధాన కార్యదర్శి బి.భాస్కర్‌ మాట్లాడుతూ దేశంలో వ్యవసాయ రంగం నష్టపోవడానికి పాలకవర్గాల విధానాలే కారణమన్నారు. పౌర హక్కుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వి.చిట్టిబాబు మాట్లాడుతూ భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పిస్తే, ప్రశ్నించడమే తప్పుగా ప్రభుత్వాలు కేసులు పెడుతున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఐఎప్టీయూ అధ్యక్షుడు కె.విశ్వనాథ్‌, ఏఐకేఎంఎస్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు టి.ప్రకాష్‌, యు.గనిరాజు, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి చీకట్ల వెంటేశ్వరరావు, అరుణోదయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.భీమశంకర్‌, పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.అనసూయ, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌.కిరణ్‌కుమార్‌ తదితరులు ప్రసగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement