దెబ్బతిన్న పంట పరిశీలన | - | Sakshi
Sakshi News home page

దెబ్బతిన్న పంట పరిశీలన

Oct 4 2026 9:49 AM | Updated on Oct 4 2026 9:49 AM

దేవరపల్లి: ఎల్‌నినో ప్రభావంతో గోపాలపురం మండలాన్ని మధ్యస్థ కరువు మండలంగా అధికారులు ప్రతిపాదించినట్లు ఎల్‌నినో ప్రత్యేక అధికారి, వ్యవసాయ శాఖ కమిషనరేట్‌ డిప్యూటీ డైరెక్టర్‌ ఎ.పార్వతి తెలిపారు. శనివారం గోపాలపురం, నల్లజర్ల, దేవరపల్లి మండలాల్లో పంటలను ఆమె పరిశీలించారు. ఇటీవల కురిసిన వర్షాలకు దేవరపల్లి, నల్లజర్లలో దెబ్బతిన్న మినుము, వరి పంటలను ఆమె చూశారు. గోపాలపురం మండలం గుడ్డిగూడెంలో ఎల్‌నినో ప్రభావంతో దెబ్బతిన్న వరి, మినుము పంటలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. గ్రామంలో 200 ఎకరాల్లో వరి, 130 ఎకరాల్లో మినుము దెబ్బతిన్నట్టు పార్వతి గుర్తించారు. మండల నివేదిక తయారు చేసి పంపించాలని వ్యవసాయ శాఖ అధికారి కె.యేసుబాబుకు సూచించారు. దేవరపల్లి మండల వ్యవసాయాధికారి కె.కమల్‌రాజ్‌, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement