క్రమంగా తగ్గుతూ.. | - | Sakshi
Sakshi News home page

క్రమంగా తగ్గుతూ..

Aug 4 2026 12:17 AM | Updated on Aug 4 2026 12:17 AM

ధవళేశ్వరం: స్థానిక కాటన్‌ బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా తగ్గుతుంది. సోమవారం తెల్లవారుజామున 13.70 అడుగులకు నీటిమట్టం చేరడంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. సాయంత్రానికి 11.70 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరికను సైతం వెనక్కి తీసుకున్నారు. నీటి ఉధృతి మరింత తగ్గుతూ రాత్రి 8 గంటలకు 11.30 అడుగులకు చేరింది. బ్యారేజీ నుంచి 9,36,808 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెట్టారు. ధవళేశ్వరం వద్ద నీటి ఉధృతి మంగళవారం మరింత తగ్గే అవకాశం ఉందని ఇరిగేషన్‌ అధికారులు అంచనా వేస్తున్నారు.

జిల్లా ప్రధాన

న్యాయమూర్తిని కలసిన ఎస్పీ

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలోని జిల్లా జడ్జి చాంబర్‌లో ఇటీవల ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జిగా నియమితులైన జునైద్‌ అహ్మద్‌ మౌలానాను జిల్లా ఎస్పీ డి.నరసింహకిశోర్‌ సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement