ఉత్సాహంగా మహిళా వాలీబాల్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా మహిళా వాలీబాల్‌ పోటీలు

Mar 20 2026 8:07 AM | Updated on Mar 20 2026 8:07 AM

మలికిపురం: ఆల్‌ ఇండియా మహిళా వాలీబాల్‌ (డే అండ్‌ నైట్‌) పోటీలు మలికిపురం మండలం తూర్పుపాలెంలో ఉత్సాహంగా సాగుతున్నాయి. గురువారం సాయంత్రం వరకూ జరిగిన లీగ్‌ పోటీలలో పలు జట్లు హోరా హోరీగా తలపడ్డాయి. చైన్నె– కర్నాటక జీఎస్టీ మధ్య జరిగిన పోటీలలో చైన్నె విన్నర్‌గా నిలిచింది. ఇంటిగ్రేటెడ్‌ కోచ్‌ ఫ్యాక్టరీ, సౌత్‌ ఈస్ట్రన్‌ రైల్వే మధ్య జరిగిన పోటీలో ఇంటిగ్రేటెడ్‌ కోచ్‌ ఫ్యాక్టరీ జట్టు విజయం సాధించింది. ఇంకా మరొక పది జట్ల మధ్య లీగ్‌ పోటీలు జరిగాయి. అడబాల స్పోర్ట్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన పోటీలను అడబాల వీర బ్రహ్మాజీరావు, అడబాల వేణుగోపాల్‌ పర్యవేక్షించారు

కోడిపందేలాడుతున్న ముగ్గురి అరెస్ట్‌

సీతానగరం: మండలంలోని నల్గొండ శివారున కోడిపందేలాడుతున్న ముగ్గురిని అరెస్ట్‌ చేసి, కేసు నమోదు చేశామని ఎస్సై డి రామ్‌కుమార్‌ గురువారం తెలిపారు. నల్గొండ శివారున కోడిపందేలాడుతుండగా సిబ్బందితో దాడి చేసి కోరుకొండ మండలం కోటి గ్రామానికి చెందిన ఇద్దరు, రాపాకకు చెందిన ఒకరిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.5,160 నగడు, ఐదు పందెం కోళ్లు, రెండు కోడి కత్తులు స్వాదీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశామని, కోర్టులో హాజరుపరుస్తామని ఎస్సై రామ్‌కుమార్‌ తెలిపారు.

రూ.కోటి ఇరవై లక్షల

ఆస్తి దానం

తాళ్లపూడి: వీలునామా ప్రకారం రూ.కోటి ఇరవై లక్షల ఆస్తిని దానం చేసి వారు తమ దాతృత్వం చాటుకున్నారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో ఉన్న శ్రీ షిరిడి సాయి ధ్యాన సేవా కేంద్రానికి పడాల భాను ప్రసాద్‌ శ్రీమతి విజయశ్రీల ఆస్తిని గురువారం దానం చేశారు. పట్టణానికి చెందిన పడాల భాను ప్రసాద్‌ కొవ్వూరులో న్యాయవాదిగా పనిచేస్తూ షిరిడి సాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేవారు. 2018లో వారి మరణానంతరం వారి భార్య విజయశ్రీ కొవ్వూరు స్టేట్‌ బ్యాంకు వెనుక వీధిలో తన నివాసం ఉంటున్న ఇంటిని తన భర్త అభీష్టం మేరకు తన తదనంతరం శ్రీ షిరిడి సాయి జనసేన కేంద్రం కొవ్వూరుకు 263 గజాల స్థలము, ఇంటిని వీలునామా ద్వారా రాసి ఉన్నారు. 2025లో ఆమె మృతి చెందారు. తరువాత వారి సోదరులైన గంధం జయ, గంధం సాయి కుటుంబ సభ్యులు వారి అక్క బావల కోరిక మేరకు విల్లుకు సంబంధించిన ఆస్తిని గురువారం సేవా కేంద్రం సభ్యులకు అప్పగించారు. సేవా కేంద్ర సభ్యులు గుడివాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ భాను ప్రసాద్‌ వారి భార్య అభీష్టం మేరకు ఈ ఆస్తిని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తామని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement