అనపర్తి: తూర్పుగోదావరి జిల్లాలోని అనపర్తి నియోజకవర్గంలో అధికార పార్టీ ఆగడాలు ఆగడం లేదు. నియోజకవర్గంలోని బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తపై అధికార పార్టీ శ్రేణులు విచక్షణారహితంగా దాడులు చేశాయి. ఈ ఘటనలో స్పృహ కోల్పోయిన బాధితుడిని ఆస్పత్రికి తరలించాయి వైఎస్సార్‌సీపీ శ్రేణులు.
ఈ దాడిపై బాధిత కుటుంబ సభ్యలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ దాడికి కారణమైన నిందితులకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు పోలీసులు. దాడులకు పాల్పడిన వారికి ఇలా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించడం విమర్శలకు దారి తీసింది. నిందితులపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు.. అధికార పార్టీకి కొమ్ముకాస్తూ నిందితుల్ని ఇలా స్టేషన్ బెయిల్‌పై పంపించడం ఏంటని వైఎస్సార్‌సీపీ ప్రశ్నిస్తోంది.

పల్నాడులో టీడీపీ గూండాలు దాడులు
ల్నాడు జిల్లాలో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై టీడీపీ గూండాలు దాడులకు దిగారు. ఈ దాడిలో ఇద్దరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


