వైభవంగా వాడపల్లి వెంకన్న అధ్యయనోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

వైభవంగా వాడపల్లి వెంకన్న అధ్యయనోత్సవాలు

Mar 20 2026 8:07 AM | Updated on Mar 20 2026 8:07 AM

ఆత్రేయపురం : కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాల్లో 5వ రోజు గురువారం ఉదయం గౌతమి గోదావరి నది నుంచి తీర్థం బిందె తీసుకురావడంతో కార్యక్రమాలు ప్రారంభించారు. శ్రీ వేంకటేశ్వరస్వామి సహిత లక్ష్మీ హోమం నిర్వహించారు. వైష్ణవ స్వాములు సేవా కాలం స్వామి వారి ఎదుట దివ్య ప్రబంధ పారాయణం భక్తిశ్రద్ధలతో చేశారు. వాడపల్లి మాడ వీధులలో గురువారం రాత్రి స్వామివారికి పల్లకి సేవ, గరుడ, సింహ, హంస వాహన సేవలు మేళతాళాలు, బాణసంచా కాల్పులుతో బాండ్‌ వాయిద్యాల నడుమ, భక్త జన రంజకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయాన్ని ప్రత్యేకంగ పండ్లు, పూలతో కన్నుల పండువగా అలంకరించారు. భక్తుల వసతుల కల్పనను ఆలయ చైర్మన్‌ ముదునూరి వెంకటరాజు, ఈవో నల్లం సూర్య చక్రధరరావుల పర్యవేక్షించారు.

రాత్రి పల్లకి, గరుడ, సింహ, హంస వాహన సేవలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement