పి.గన్నవరం: స్థానిక మూడు రోడ్ల సెంటర్‌లో రావులపాలెం వైపు వెళ్లే ప్రయాఫికుల కోసం గతంలో నిర్మించిన విశ్రాంతి భవనాన్ని కూటమి నాయకులు ఫ్లెక్సీలతో మూసేశారు. లోపలకు వెళ్లి కూర్చునే అవకాశం లేకుండా ఫ్లెక్సీలు అడ్డుగా కట్టడంతో ప్రయాణికులు రోడ్డు మీదనే నిల్చుని బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో విశ్రాంతి భవనంలోని బల్లలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. కూటమి నేతల తీరుపై ప్రయాణికులతో పాటు స్థానికులు విమర్శిస్తున్నారు. ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. తక్షణమే అడ్డుగా ఉన్న ఫ్లెక్సీలు తొలగించాలని కోరుతున్నారు.


