సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో 241 అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ కీర్తి మాట్లాడుతూ ప్రజలు టోల్ ఫ్రీ నంబర్ 1100 కు కాల్ చేసి ఫిర్యాదులు నమోదు చేయవచ్చని తెలిపారు. జాయింట్ కలెక్టర్ మేఘ స్వరూప్ మాట్లాడుతూ రెవెన్యూ క్లినిక్ ద్వారా ప్రజల నుంచి అందిన అర్జీలను వేగంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డీఆర్‌ఓ సీతారామమూర్తి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
పోలీస్ పీజీఆర్‌ఎస్‌కు 40 ఫిర్యాదులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 40 ఫిర్యాదులు వచ్చాయి. పీజీఆర్‌ఎస్‌ను ఎస్పీ డి.నరసింహాకిశోర్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి అర్జీదారులు హాజరయ్యారు. ఎస్పీ అర్జీలు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే నేరుగా సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదిదారుల సమస్యలను పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయవలసిందిగా ఉత్తర్వులు ఇచ్చారు.


