పుట్టినప్పటి నుంచి నిర్దేశించిన సమయాల్లో చిన్నారులకు టీకాలను వేయడం ద్వారా వారిని ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుకోగలం. ఎప్పుడెప్పుడు ఏ ఏ టీకాలు వేయాలన్న దానిపై ఆరోగ్య కార్యకర్తలు ముందుగానే చెబుతారు. వాటిపై పిల్లల సంరక్షకులు అవగాహన పెంచుకుని క్రమం తప్పకుండా టీకాలను వేయిస్తుండాలి.
– డాక్టర్ బీవీవీ సత్యనారాయణ, కోనసీమ జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి
అవగాహన కల్పిస్తున్నాం
చిన్నారులకు నిర్దేశించిన సమయంలో వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలి. వీటివల్ల ప్రాణాంతక వ్యాధుల నుంచి చిన్నారులను కాపాడుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు టీకాలపై వైద్య సిబ్బంది ద్వారా అవగాహన కల్పిస్తున్నాం.
– టి.గంగాధరరావు,
పీహెచ్‌సీ వైద్యుడు, నల్లజర్ల
●


