కోరుకొండ: స్థానిక బూరుగుపూడి సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. కోరుకొండ ఎస్సై ఆర్.అంకారావు కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం ఇన్సీసుపేటకు చెందిన బొర్రా ప్రభాకరరావు (59) గోకవరం నుంచి మోటారు సైకిల్‌పై బయలు దేరారు. ఈ నేపథ్యంలో ఎదురుగా వస్తున్న మోటార్ సైకిలిస్ట్ ఢీకొనడంతో తలకు బలమైన గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రభాకరరావు రోజూ గోకవరం, కోరుకొండ మండలాల్లో దుస్తులు అమ్ముతుంటాడు. ఇతనికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. రోజూలానే గురువారం దుస్తులు విక్రయించి తిరిగి రాజమహేంద్రవరం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయనున్నట్టు ఎస్సై వివరించారు.


