పోరుబాట.. విలువలకు పీట | - | Sakshi
Sakshi News home page

పోరుబాట.. విలువలకు పీట

Mar 13 2026 7:57 AM | Updated on Mar 13 2026 7:57 AM

సాక్షి, రాజమహేంద్రవరం: విలువలతో కూడిన రాజకీయాలు అంతమైన తరుణంలో విలువలు, విశ్వసనీయత అన్న పదాలకు అర్థం చెప్పింది వైఎస్సార్‌ సీపీ. ప్రజాభ్యుదయమే పరమావధిగా, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, సవాళ్లను సోపానాలుగా మలచుకుని ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ.. మహానేత వైఎస్సార్‌ ఆశయ సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఏకై క పార్టీ వైఎస్సార్‌ సీపీ అని మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ, పార్లమెంటరీ ఇన్‌చార్జిలు పేర్కొన్నారు. రాజకీయాల్లో నైతిక విలువను చాటి చెప్పిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ ప్రజలకు భరోసా ఇస్తూ ముందుకు వెళుతున్నారన్నారు. జగన్‌ చెప్పాడంటే.. చేస్తాడంతే అంటూ ప్రజల్లో నమ్మకం, విశ్వాసం గడించిన పార్టీగా చరిత్ర సృష్టించిందని గుర్తుచేశారు. వైఎస్సార్‌ సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవం జిల్లావ్యాప్తంగా గురువారం ఘనంగా నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్తలు, పార్లమెంటరీ ఇన్‌చార్జిలు, పార్టీ శ్రేణులు కేక్‌ కట్‌ చేశారు. పార్టీ జెండా ఆవిష్కరించారు. ప్రజలతో కలిసి సంబరాలు చేసుకున్నారు. పార్టీ ఆవిర్భావ సంబరాలు అంబరాన్ని అంటాయి.

రాజమహేంద్రవరం రూరల్‌

వైఎస్సార్‌ సీపీ రాజమహేంద్రవరం రూరల్‌ కార్యాలయంలో మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. తొలుత పార్టీ జెండా ఆవిష్కరించారు. కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. ప్రజా శ్రేయస్సు, సమస్యల పరిష్కారం కోసం మాజీ ముఖ్యమంతి వైఎస్‌ జగన్‌ చేస్తున్న పోరాటాలను గుర్తుచేసుకున్నారు. రాజమహేంద్రవరం పార్లమెంట్‌ ఇన్‌చార్జీ డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌, రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ మేడపాటి షర్మిలారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గొందేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.

రాజమహేంద్రవరం సిటీ

ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని వైఎస్సార్‌ సీపీ శ్రేణులు పేర్కొన్నాయి. వైఎస్సార్‌ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ ఆదేశాల మేరకు మార్గాని ఎస్టేట్‌లోని పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్‌ కట్‌చేశారు. ఆవిర్భావ వేడుకల్లో పార్టీ సీఈసీ సభ్యులు, రుడా మాజీ చైర్మన్‌ రౌతు సూర్య ప్రకాశరావు, ఉభయ తెలుగు రాష్ట్రాల బీసీ జేఏసీ గౌరవ అధ్యక్షుడు మార్గాని నాగేశ్వరరావు, రాజమహేంద్రవరం పార్లమెంటరీ సమన్వయ కర్త డాక్టర్‌ గూడూరి శ్రీనివాస్‌, రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ మేడపాటి షర్మిలారెడ్డి, రాష్ట్ర పార్టీ సంయుక్త కార్యదర్శి గుర్రం గౌతమ్‌, సీనియర్‌ ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు వాసంశెట్టి గంగాధరరావు పాల్గొన్నారు.

కొవ్వూరు

వైఎస్సార్‌ సీపీ కొవ్వూరు కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం వైభవంగా నిర్వహించారు. తలారి, పార్టీ నేతలు పార్టీ జెండా ఆవిష్కరించారు. వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం కేక్‌ కేట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. మిఠాయిలు పంచిపెట్టారు. వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావం నుంచి నేటి వరకు ప్రజల పక్షాన చేస్తున్న పోరాటాలను వివరించారు. అంతేగాక తాళ్లపూడి మండలం పెద్దేవం, అన్నదేవరపేట గ్రామాల్లో ఆవిర్భావ వేడుకలు అంబరాన్ని అంటాయి.

నిడదవోలు

పట్టణంలోని వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి జి శ్రీనివాస్‌నాయుడు పార్టీ జెండా ఆవిష్కరించారు. వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు.

గోపాలపురం

దేవరపల్లి మండలం యర్నగూడెంలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయం వద్ద మాజీ మంత్రి, నియోజకవర్గ ఇన్‌చార్జి తానేటి వనిత ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. కార్యాలయం వద్ద పార్టీ జెండా ఆవిష్కరించారు. కేక్‌ కట్‌ చేశారు. అనంతరం వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులు అర్పించారు.

అనపర్తి:

వైఎస్సార్‌ సీపీ 16వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం అనపర్తిలో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా వేడుకలు నిర్వహించారు. మాజీ శాసనసభ్యులు డాక్టర్‌ సత్తి సూర్యనారాయణరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని దేవీచౌక్‌ సెంటర్‌లోని దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ రానున్న రోజుల్లో పార్టీ విజయదుందుభి మోగిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

రాజానగరం

ప్రజల భావోద్వేగాలు, పోరాటాలతో పుట్టిన పార్టీ వైఎస్సార్‌ సీపీ అని ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. కోరుకొండలో గురువారం వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కోరుకొండలో నిర్వహించిన వేడుకల్లో రాజా పాల్గొన్నారు. కేక్‌ కట్‌ చేసి స్వీట్లు పంచారు. అంబేడ్కర్‌, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్యాంగ స్ఫూర్తితో దేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఏర్పడ్డాయని, కొన్ని కాలగర్భం లో కలిసిపోయాయన్నారు. వైఎస్సార్‌ సీపీ మాత్రం ప్రజల పక్షాన పోరాటాలు కొనసాగిస్తూనే ఉందన్నారు.

మండపేట

వైఎస్సార్‌ సీపీ ఆవిర్భావ దినోత్సవాన్ని మండపేట నియోజకవర్గంలోని మండపేట పట్టణం, మండపేట రూరల్‌ మండలంలోని 12 గ్రామాలు, కపిలేశ్వరపురం మండలంలోని 19 గ్రామాలు, రాయవరం మండలంలోని 12 గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఆధ్వర్యంలో పట్టణంలోని నియోజకవర్గ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఆయన మాట్లాడుతూ పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకుని సామాన్యుల అవసరాలకు అనుగుణంగా పార్టీ మేనిఫెస్టోను రూపొందించారన్నారు.

16 ఏళ్లుగా ప్రజల పక్షాన వైఎస్సార్‌ సీపీ

ప్రజా సమస్యల పరిష్కారంపై

నిరంతర పోరాటం

జిల్లాలో ఘనంగా పార్టీ

ఆవిర్భావ దినోత్సవం

కేక్‌ కట్‌ చేసి జెండా ఆవిష్కరించిన

నాయకులు, కార్యకర్తలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement