పల్లెసేవకు ప్రోత్సాహకం | - | Sakshi
Sakshi News home page

పల్లెసేవకు ప్రోత్సాహకం

Mar 11 2026 7:50 AM | Updated on Mar 11 2026 7:50 AM

ఫెలోషిప్‌ అందించనున్న ఎస్‌బీఐ

యువతకు మంచి అవకాశం

బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): పల్లెల ప్రగతితోనే దేశాభివృద్ధి సాధ్యమనేది జగమెరిగిన సత్యం. యువత భాగస్వామ్యంతో దీన్ని ఆచరణలోకి తేచ్చేందుకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా యూత్‌ ఫర్‌ ఇండియా పేరిట ఫెలోషిప్‌ అందిస్తోందని ఆ బ్యాంక్‌ గైగోలుపాడు శాఖ చీఫ్‌ మేనేజర్‌ అద్దంకి శివప్రసాద్‌ తెలిపారు. వివరాల్లోకి వెళితే.. పల్లెసేవకు ముందుకు వచ్చే యువతను ఈ పథకం ద్వారా అన్ని విధాలా ప్రోత్సహించనుంది. దీనికి 21 నుంచి 32 ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులు. 2026 అక్టోబర్‌ లోగా ఏదైనా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. 13 నెలలు కొనసాగే ఈ కార్యక్రమానికి ఎంపిక పక్రియ వివిధ దశల్లో ఉంటుంది. దరఖాస్తులో ప్రాథమిక వివరాలు అందిస్తే రెండో దశలో ఆన్‌లైన్‌ అసైన్‌మెంట్‌లో సామాజిక సమస్యలపై వ్యాసాలు రాయడంతో పాటు వాటికి పరిష్కారం చూపే సూచనలు ఇవ్వాలి. తర్వాత వ్యక్తిగత ముఖాముఖి నిర్వహిస్తారు. ఆసక్తి కలవారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూయూత్‌ఫర్‌ఇండియా.ఓఆర్‌జీ అనే ఏప్రిల్‌ 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి.

గౌరవ వేతనం

ఎంపికై న వారికి నెలకు రూ.16 వేల గౌరవ వేతనం అందిస్తారు. ప్రయాణ ఖర్చులకు రూ.2 వేలు, ప్రాజెక్టు సమర్పణకు రూ.వెయ్యి అదనంగా చెల్లిస్తారు. ఫెలోషిప్‌ను విజయవంతంంగా పూర్తి చేసిన వారికి రీఅడ్డస్ట్‌మెంట్‌ అలవెన్స్‌ రూ.50 వేలు ఇవ్వనున్నారు. ఫెలోషిప్‌ కాలంలో ఆరోగ్య, వ్యక్తిగత ప్రమాద బీమా సౌకర్యం ఉంటుంది.

ప్రయోజనాలు

జాతీయ స్థాయిలో పేరుపొందిన ఎస్‌బీఐ ఫౌండేషన్‌, స్వచ్ఛంద సంస్థలతో పనిచేసే అవకాశం లభిస్తుంది. గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం, విద్య, గ్రామీణుల జీవనోపాధుల్లో మార్పు తీసుకొచ్చేందుకు సేవారంగంలో ముందుకు వెళ్లాలనుకునే యువతకు ఇదో మంచి వేదికగా చెప్పవచ్చు. ఫెలోషిప్‌ పూర్తిచేసిన వారికి లభించే ధ్రువీకరణ పత్రాల ద్వారా భవిష్యత్తులో ఉత్తమ అవకాశాలు పొందవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement