ఫఆపకుంటే ఆందోళన చేపడతాం
ఫకాకినాడ నాగమల్లితోట వాసుల
ఆందోళన
కాకినాడ రూరల్: గుడి, బడి, ఆస్పత్రులకు దగ్గరగా మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లకు అనుమతులు ఇవ్వకూడదనే నిబంధనలు ఉన్నప్పటికీ అవేవీ పట్టించుకోకుండా బార్ నిర్మాణ పనులు చేపడుతున్నారని నాగమల్లితోట కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. నాగమల్లితోట పారిశ్రామిక వాడలో మూతపడిన ఒక యూనిట్ వద్ద పాత భవనాలను కూల్చివేసి అక్కడ బార్ అండ్ రెస్టారెంట్ ఏర్పాటు చేసేందుకు పనులు చేపడుతున్నారు. బయట బార్ లైసెన్స్‌తో కూడిన ఫ్లెక్సీ ఏర్పాటు చేయడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ప్రశాంతంగా ఉండే ఈ ప్రాంతంలో బార్ నిర్వహిస్తే శాంతి భద్రత సమస్యలు తలెత్తుతాయని, ఆకతాయిలు, మద్యం బాబులతో తాము ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కాలనీ వాసులు పేర్కొంటున్నారు. పక్కనే ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఈ మార్గంలోనే రెండు కార్పొరేట్ ఆస్పత్రులున్నాయి. పాఠశాలల సమీపంలో ఉండడంతో ఈ మార్గంలోనే విద్యార్థులు రాకపోకలు సాగిస్తుంటారు. ఇటువంటి ప్రాంతంలో బార్ అండ్ రెస్టారెంట్‌కు అనుమతులు ఎలా ఇచ్చారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గుడి పక్కనే బార్‌కు అనుమలు ఇవ్వడంపై అధికార పార్టీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బార్ నిర్మాణ పనులు ఆపకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరిస్తున్నారు.


