అబ్బురం.. సైన్స్ సంబరం
రాజమహేంద్రవరం రూరల్: చిట్టి మెదళ్లు గట్టి ఆలోచనలే చేశాయి. సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలకు రూపమిచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు తమ ఉపాధ్యాయుల తోడ్పాటుతో రూపొందించిన ప్రాజెక్టులను.. బొమ్మూరులోని శ్రీ సత్యసాయి గురుకులంలో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రదర్శించారు. అందరినీ అబ్బురపరిచారు. ఈ ప్రదర్శనను రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ ప్రారంభించి, ఆయా ప్రాజెక్టులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, విద్యార్థుల ఆలోచనా శక్తిని, సృజనాత్మకతను పెంపొందించుకోవడానికి ఈ ప్రదర్శన దోహదపడుతుందని అన్నారు. ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ, వైజ్ఞానిక ప్రదర్శనలతో విద్యార్థుల మేధస్సు మరింత వికసిస్తుందని చెప్పారు. డీఈఓ కంది వాసుదేవరావు మాట్లాడుతూ, విద్యార్థులు శాసీ్త్రయ దృక్పథంతో ప్రాజెక్టులు తయారు చేసి, రాష్ట్ర స్థాయిలో సత్తా చాటాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో డీవైఈఓ బి.దిలీప్ కుమార్, జిల్లా సైన్స్ అధికారి జీవీఎన్‌ఎస్ నెహ్రూ, గురుకులం కరస్పాండెంట్ శ్యాంసుందర్, ప్రిన్సిపాల్ గుర్రయ్య, రూరల్ ఎంఈఓ తులసీదాస్, డీసీఈబీ కార్యదర్శి దేవా అనిత, సీఎంఓ శ్రీనివాసరావు, రాష్ట్ర ప్రధానోపాధ్యాయుల సంఘం సహాయ కార్యదర్శి కోలా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించాలి
విద్యార్థుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించాలని ఇన్‌చార్జి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ వై.మేఘస్వరూప్ అన్నారు. సాయంత్రం జరిగిన జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులు భావి శాస్త్రవేత్తలుగా, పరిశోధకులుగా ఎదగాలని అన్నారు. విద్యార్థుల ప్రదర్శనలను పరిశీలించి, సూచనలు ఇచ్చారు. రాష్ట్ర స్థాయికి ఎంపికై న విద్యార్థులను అభినందించి, సర్టిఫికెట్లు అందజేశారు.
రాష్ట్ర స్థాయికి ఎంపికై న ప్రాజెక్టులు
గ్రూపు
ఫ సస్టెయినబుల్ అగ్రికల్చర్ విభాగంలో క్రాప్ మెయింటెయినింగ్ సిస్టమ్ (కె.నవీన, కె.గీతికశ్రీ, 9వ తరగతి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకులం, గోపాలపురం)
ఫ వేస్ట్ మేనేజ్‌మెంట్ అండ్ ఆల్టర్నేటివ్స్ టు ప్లాస్టిక్ విభాగంలో వేస్ట్ మేనేజ్‌మెంట్ ఇన్ ఎండీఎం (సీహెచ్ గురుసాయిరామ్, సీహెచ్ రియాజ్, 7వ తరగతి, జెడ్పీ హైస్కూల్, రేగులగుంట).
ఫ గ్రీన్ ఎనర్జీ విభాగంలో ఈ–వేస్ట్ కన్వర్ట్ టు ఎనర్జీ (డి.కీర్తన, కె.సత్య, 8వ తరగతి, జెడ్పీ హైస్కూల్, పురుషోత్తపల్లి)
ఫ రీక్రియేషనల్ మేథమెటికల్ మోడలింగ్ విభాగంలో ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ ఇన్‌స్పైర్డ్ బై మ్యాథ్స్ (జి.భాస్కరి, ఎం.సీత, 8వ తరగతి, జెడ్పీ హైస్కూల్, రంగంపేట)
ఫ హెల్త్ అండ్ హైజీన్ విభాగంలో హెల్త్ అండ్ హైజీన్ (కె.వర్షిత్ కుమార్, ఎస్.సిద్ధార్థ, జెడ్పీ హైస్కూల్, రామచంద్రపురం)
ఫ వాటర్ కన్జర్వేషన్ అండ్ మేనేజ్‌మెంట్ విభాగంలో వేస్ట్ మేనేజ్‌మెంట్ అండ్ ఆల్టర్నేటివ్స్ టు ప్లాస్టిక్స్ (ఆర్.సంపత్, డి.జోసఫ్ చరణ్, 9వ తరగతి, లూథరన్ ఎయిడెడ్ హైస్కూల్, రాజమహేంద్రవరం)
ఫ ఎమర్జింగ్ టెక్నాలజీ విభాగంలో స్టూడెంట్ ఫ్రెండ్లీ పెన్ (బి.పల్లవి, ఎం.దీక్షిత, 9వ తరగతి, జెడ్పీ హైస్కూల్, రంగంపేట)
వ్యక్తిగత విభాగం
ఫ ఇంజినీరింగ్ టెక్నాలజీ విభాగంలో ఇన్ఫినెట్ (కె.పూర్ణ వసుధ, 9వ తరగతి, జెడ్పీ హైస్కూల్, రంగంపేట)
ఫ వుమెన్ సేఫ్టీ హ్యాండ్ బెల్ట్ (ఎస్.సుమశ్రీసాయి, 9వ తరగతి, జెడ్పీ హైస్కూల్, ఉండ్రాజవరం)
టీచర్ విభాగం
ఫ ఫిజిక్స్‌లో ఎ ఇన్నోవేటివ్ ఫిజిక్స్ ఎగ్జిబిట్స్ (కేఎస్‌ఆర్ ఆంజనేయులు, జెడ్పీ హైస్కూల్, పురుషోత్తపల్లి)
ఫ ఎన్విరాన్‌మెంట్ సైన్స్ విభాగంలో ఎకో బ్రిక్స్ (బీబీ విజయకుమారి, ఎస్‌కేవీటీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, రాజమహేంద్రవరం)
ఫ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో 209 ప్రాజెక్టులు
ఫ ఆలోచింపజేసిన నమూనాలు
ఫ ప్రతిభ చూపిన విద్యార్థులు


