ఆర్‌డీవో, డీఎస్పీ ఆఫీసులు కొనసాగించాలని వినతి
అమలాపురం రూరల్: రామచంద్రపురం రెవెన్యూ డివిజనల్ కార్యాలయం, రామచంద్రపురం రెవెన్యూ సబ్ డివిజన్‌ను తరలించడం కూడదని, దీనివల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారని కలెక్టర్ ఆర్.మహేష్‌కుమార్‌కు పలువురు నాయకులు వినతిపత్రాలు అందించారు. మండపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని తూర్పు గోదావరి జిల్లాలో కలిపే ప్రతిపాదన ఉందని దీనివల్ల రామచంద్రపురం నియోజకవర్గంలో కేవలం రెండు మండలాలు మాత్రమే ఉంటాయి. ఫలితంగా 12 సంవత్సరాలుగా పనిచేస్తున్న రామచంద్రపురం రెవెన్యూ డివిజనల్ ఆఫీస్, సబ్ డివిజనల్ ఆఫీస్‌లు పొరుగు నియోజకవర్గాలకు తరలిస్తారు. వీటిని కొనసాగించాలని రామచంద్రపురం నియోజకవర్గ వైఎస్సార్ సీపీ కోర్టినేటర్ పిల్లి సూర్యప్రకాష్, రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, పెమ్మిరెడ్డి మురళి, అమలాపురం పట్టణ అధ్యక్షుడు సంసాని నాని, మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ ఖాదర్, అఖిల పక్ష నాయకుడు సలాది సతీష్‌నాయుడుకలెక్టర్‌ను కలిసి వినిత పత్రం అందిచారు. ఈ ఆఫీస్‌ను మూసివేస్తే రైతులు, సీనియర్ సిటిజన్లు, మహిళలు, కూలీలు, సాధారణ ప్రజలకు కష్టాలు ఏర్పడతారయని అందువల్ల, వాటిని యథాతథంగా కొనసాగించాలని వారు కోరారు.


