జాతీయ స్థాయి సెపక్‌తక్రాలో కాంస్యం
దేవరపల్లి: రాజస్థాన్‌లోని జోథ్‌పూర్‌లో ఈ నెల 15 నుంచి 22వ తేదీ వరకూ జరిగిన 69వ జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ పోటీల్లో రాష్ట్ర బాలికల జట్టు అండర్–17 విభాగంలో ద్వితీయ స్థానంతో కాంస్య పతకం గెలుచుకుంది. జట్టు కోచ్‌గా దేవరపల్లి మండలం దుద్దుకూరు జెడ్పీ హైస్కూలు పీడీ ఆచంట వెంకటేశ్వరరావు, మేనేజర్‌గా బి.సంధ్య వ్యవహరించారు. ఈ జట్టులో వి.కావ్య, కె.లావణ్య (కృష్ణా), పి.మధురశ్రీ (పశ్చిమ గోదావరి), జి.రమ్య (తూర్పు గోదావరి), జి.చైతన్య కుమారి (అనంతపూర్) పాల్గొని అద్భుత ప్రతిభను కనబరిచారని కోచ్ వెంకటేశ్వరరావు సోమవారం తెలిపారు. ఈ జట్టులోని మధురశ్రీ దేవరపల్లి మండలం చిన్నాయగూడేనికి చెందిన క్రీడాకారిణి కావడం విశేషం.
పీజీఆర్‌ఎస్‌కు 240 అర్జీలు
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జిల్లా స్థాయి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్)లో వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రజలు 240 అర్జీలు సమర్పించారు. వారి నుంచి జాయింట్ కలెక్టర్ వై.మేఘస్వరూప్ తదితరులు అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ, అర్జీలను ఆర్థిక సంబంధిత, ఆర్థికేతరమైనవిగా విభజించామన్నారు. ఆర్థిక సంబంధిత అర్జీల పరిష్కారంలో కొంత ఆలస్యం జరిగి నా సహించవచ్చని, అయితే ఆర్థికేతరమైనవి మా త్రం తప్పనిసరిగా గడువులోపే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల్లో గతంలో వచ్చిన అర్జీలు ఎందుకు పెండింగ్‌లో ఉన్నా యో సంబంధిత అధికారులను ఆరా తీశారు. సమస్యను పూర్తిగా అధ్యయనం చేసి క్షేత్ర స్థాయిలో పరిష్కరించాలని జేసీ ఆదేశించారు.
పోలీస్ పీజీఆర్‌ఎస్‌కు
37 ఫిర్యాదులు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమానికి 37 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఎస్పీ డి.నరసింహ కిశోర్ ఫిర్యాదులు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే సంబంధిత పోలీసు స్టేషన్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఫిర్యాదీల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు.
డిజిటల్ భద్రతపై వర్క్‌షాప్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): డిజిటల్ భద్రత, ఆన్‌లైన్ మోసాలు, మహిళలపై నేరాలు, స్ట్రెస్ మేనేజ్‌మెంట్ అంశాలపై సీఐడీ కార్యాలయంలో సోమవారం వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐడీ అదనపు ఎస్పీ ఆస్మా ఫరీన్ మాట్లాడుతూ, డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు వేగంగా పెరుగుతున్నాయని అన్నారు. ఉద్యోగులు, ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని సూచించారు. మహిళలు, బాలికలపై నేరాల నియంత్రణకు సంబంధిత చట్టాలపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. మానసిక ఒత్తిడిని సమర్థవంతంగా ఎదుర్కొంటే విధి నిర్వహణ మరింత సులభమవుతుందని చెప్పారు. బెట్టింగ్, లోన్ యాప్‌ల వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలపై గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పి.కల్యాణ్ చక్రవర్తి వివరించారు. ఇన్వెస్ట్‌మెంట్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ మోసాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగంపై అమరా వతి సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ట్రైనర్ సానబోయిన ఆశ్రిత్ కుమార్ అవగాహన కల్పించారు. మహిళలు, బాలికలపై నేరాలు, పోక్సో చట్టం అమలు అంశాలపై జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్ పేరిచర్ల సూర్య ప్రభావతి మాట్లాడారు. ఒత్తిడి తగ్గింపు, సమ య నిర్వహణ అంశాలపై ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్‌కు చెందిన సైకాలజిస్ట్ ఎం.గోపాలకృష్ణ వివరించారు. సీఐడీ రాజమహేంద్రవరం ఇన్‌స్పెక్టర్లు, సిబ్బంది, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
జాతీయ స్థాయి సెపక్‌తక్రాలో కాంస్యం
జాతీయ స్థాయి సెపక్‌తక్రాలో కాంస్యం


