
మార్కెట్‌లో కొత్త థార్–రీఫ్రెష్ విడుదల
రాజమహేంద్రవరం రూరల్: ప్రముఖ మహేంద్రా డీలరైన రాజమహేంద్రవరంలోని ఎంఅండ్‌ఎన్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో రిఫ్రెష్డ్ డిజైన్, మెరుగైన కంఫర్ట్, స్మార్ట్ కనెక్టివిటీతో కొత్త థార్‌ను మంగళవారం సాయంత్రం మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ శ్రీరామ్ మాట్లాడుతూ, ఐకానిక్ డిజైన్ డ్యుయల్–టోన్ బంపర్‌తో పాటు, విభిన్నమైన ఫ్రంట్ గ్రిల్, కొత్త స్టీరింగ్ వీల్‌తో, పూర్తిగా కొత్త బ్లాక్ థీమ్ డాష్ బోర్డ్, ఆరు రంగుల్లో (టాంగో రెడ్, బ్యాటిల్‌షిప్ గ్రే కొత్తవి) లభ్యమవుతాయన్నారు. కంఫర్ట్, కన్వీనియెన్స్, స్లైడింగ్ ఆర్మ్‌రెస్ట్, రియర్ ఏసీ వెంట్స్‌తో కూడిన కొత్త సెంటర్ కన్సోల్, డోర్–మౌంటెడ్ పవర్ విండోస్, అంతర్గతంగా పనిచేసే ఇంధన మూత, డెడ్ పెడల్ (ఏటీ), రియర్ వాష్ వైపర్, ఏ–పిల్లర్ ఎంట్రీ అసిస్ట్ హ్యాండిల్, రియర్ వ్యూ కెమెరా, స్మార్ట్ టెక్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లేతో 26.03 సెం.మీ. హెచ్‌డీ ఇన్ఫోటై మెంట్ స్క్రీన్, యూఎస్‌బీ పోర్ట్ (ముందు, వెనుక) ఉంటాయని వివరించారు. దీని ప్రారంభ ధర రూ.9.99 లక్షల నుంచి ప్రారంభమవుతుందని చెప్పారు. కొత్త థార్‌ను కొత్త డిజైన్, అధునాతన కంఫర్ట్ ఫీచర్లు, స్మార్ట్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్‌తో రూపొందించబడిందన్నారు. బహుళ ట్రాన్స్‌మిషన్లతో జత చేయబడిన విభిన్న డ్రైవింగ్ ప్రాధాన్యాలకు అనుగుణంగా మహీంద్రా అనేక రకాల ఇంజిన్ ఎంపికలను అందిస్తుందన్నారు. 6–స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 6–స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ తదితర సౌలభ్యాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో సంస్థ జనరల్ మేనేజర్ రాజా, సేల్స్ మేనేజర్లు, ప్రాసెస్ సిబ్బంది, కస్టమర్లు, ఫైనాన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.