
రాష్ట్ర స్థాయి సెపక్‌తక్రా పోటీలకు జిల్లా జట్ల ఎంపిక
దేవరపల్లి: రాష్ట్రస్థాయి సెపక్‌తక్రా పోటీలకు తూర్పుగోదావరి జిల్లా బాలబాలికల జట్ల ఎంపిక గురువారం దేవరపల్లి మండలం రామన్నపాలెం జెడ్పీ హైస్కూలు క్రీడా మైదానంలో జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగింది. ఎంపిక పోటీల్లో సుమారు 100 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. జూనియర్ విభాగంలో బాల బాలికల జట్ల ఎంపిక జరిగింది. ఈ జట్లు ఈ నెల 11,12 తేదీల్లో బాపట్లలో జరుగుతున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటున్నట్టు ప్రధానోపాధ్యాయుడు పేరం రవీంథ్రనాథ్ తెలిపారు. బాలుర జట్టుకు జి. కోట సతీష్(దొమ్మేరు), ఎం.ఆంథోని(రామన్నపాలెం), వై. పాల్(దొమ్మేరు), బి, చరణ్(దొమ్మేరు), ఎ. వివేక్(దేవరపల్లి), బి. రాధాకృష్ణ (రామన్నపాలెం) ఎంపికయ్యారు. బాలికల జట్టులో దుర్గామాధవశ్రీ (చిన్నాయగూడెం), ఎం. మహాలక్ష్మి (రామన్నపాలెం), ఎం.లాస్య(రామన్నపాలెం), ఎస్‌కే మనిషాబేగం(రామన్నపాలెం), ఎం.జేసీశ్రీ(రామన్నపాలెం), డి. సౌజన్య(చిన్నాయగూడెం), కె. సౌజన్య(చిన్నాయగూడెం), కె. సుభాషిణి (రామన్నపాలెం) ఎంపికై నట్టు రవీంధ్రనాథ్ తెలిపారు. పోటీలను పీడీలు ఎల్. గణపతి, టి.సరస్వతి, సీహెచ్ సతీష్, పి.సాయి పర్యవేక్షించారు.
11, 12 తేదీల్లో బాపట్లలో
జాతీయ స్థాయి పోటీలు