
ఘనంగా పవిత్రోత్సవాలు
పెరవలి: అన్నవరప్పాడు అలివేలు మంగా వేంకటేశ్వరస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలను సోమవారం శాస్త్రోక్తంగా ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలో ఉదయం హోమం నిర్వహించారు. నూలు దండలతో స్వామి, అమ్మవార్ల మూర్తులను రూపొందించి, కలశ పూజతో పాటు వివిధ అర్చనలు నిర్వహించారు. పవిత్రోత్సవాలకు సంబంధించిన వివిధ క్రతువులు రాత్రి 9 గంటల వరకూ జరుగుతాయని ఆలయ ఈఓ మీసాల రాధాకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా వేద పండితుల సుస్వర వేద మంత్రాలతో ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. భక్తుల గోవింద నామోచ్చారణ ఆ ప్రాంతమంతా ప్రతిధ్వనించింది.

ఘనంగా పవిత్రోత్సవాలు