
మిథున్‌రెడ్డిపై అక్రమ కేసులు దారుణం
రాజమహేంద్రవరం సిటీ: రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డిపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడం దారుణమని రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్, నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీ కృష్ణంరాజు ధ్వజమెత్తారు. ఆదివారం రాజమహేంద్రవరంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులను వారు కలసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీ మిథున్‌రెడ్డిపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి, అన్యాయంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్యన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజల తరఫున వైఎస్సార్ ీసీపీ నిరంతరం పోరాడుతుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు జరిపే వరకూ పోరాటం ఆగదన్నారు. మళ్లీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమన్నారు. మిథున్‌రెడ్డి నిర్ధోషిగా త్వరలోనే బయటకు వస్తారన్నారు. వీరి వెంట రామచంద్రపురం నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జ్ పిల్లి సూర్యప్రకాష్, రాయవరం సత్తిబాబు ఉన్నారు.
పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులను కలసిన
సుభాష్ చంద్రబోస్