
వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ కమిటీల్లో చోటు ˘
రాజమహేంద్రవరం సిటీ: వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన నాయకులను రాష్ట్ర అనుబంధ కమిటీల్లో వివిధ హోదాల్లో నియమించారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. స్టేట్ పబ్లిసిటీ వింగ్ సెక్రటరీగా వాసంశెట్టి పావనీ కుమారి (గోపాలపురం), స్టేట్ సోషల్ మీడియా సెక్రటరీగా వామిశెట్టి పరమేశ్వరరావు (గోపాలపురం), స్టేట్ క్రిస్టియన్ మైనార్టీ సెల్ జాయింట్ సెక్రటరీగా ఎజ్జల రాజా(రాజానగరం)లను నియమించారు.
నేడు వైఎస్సార్ సీపీ
జిల్లా కార్యవర్గ సమావేశం
రాజమహేంద్రవరం రూరల్: వైఎస్సార్ సీపీ జిల్లా కార్యవర్గ సమావేశం బొమ్మూరులోని పార్టీ కార్యాలయంలో శనివారం ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. జిల్లా కార్యవర్గంలోని ప్రతి ఒక్కరూ ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. పార్టీకి సంబంధించిన పలు అంశాలపై దిశానిర్దేశం చేస్తామని వేణు తెలిపారు.
డైట్ ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా రాజు
రాజమహేంద్రవరం రూరల్: బొమ్మూరులోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్) ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా సీనియర్ లెక్చరర్ ఆర్‌జేడీ రాజు నియమితులయ్యారు. ఇప్పటి వరకూ ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహించిన డాక్టర్ ఏఎం జయశ్రీ గురువారం ఉద్యోగ విరమణ చేశారు. ఆమె స్థానంలో ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా రాజు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనను అధ్యాపకులు, నాన్ టీచింగ్ సిబ్బంది, ఛాత్రోపాధ్యాయులు అభినందించారు.
ఘనంగా సామూహిక
వరలక్ష్మీ వ్రతాలు
సామర్లకోట: శ్రావణ మాసం రెండో శుక్రవారాన్ని పురస్కరించుకుని పంచారామ క్షేత్రమైన బాలాత్రిపుర సుందరీ సమేత చాళుక్య కుమారారామ భీమేశ్వరస్వామి ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. మహిళలు బియ్యం, కలశం, జాకెట్టు ముక్క తీసుకుని రాగా.. వ్రతాలకు కావలసిన వరలక్ష్మీ రూపు, ఫొటో, తోరాలు, గాజులు, పువ్వులు, తమలపాకులు, వక్కలు, అరటి పండ్లు, కొబ్బరి కాయలు, ప్లేటు, ప్రమిదలు, ఒత్తులు, నూనెను దాతలు ఏర్పాటు చేశారు. దేవస్థానం సహకారంతో భక్తులకు ప్రసాదం అందజేశారు. సామూహిక వ్రతాలకు వచ్చిన మహిళలతో ఆలయం మొదటి అంతస్తు, దిగువన ఉన్న ఉపాలయాల ప్రాకారాలు నిండిపోయాయి. అధికారులు ఊహించని విధంగా సుమారు వెయ్యి మంది మహిళలు సామూహిక వ్రతాలు ఆచరించారు. ఈఓ బళ్ల నీలకంఠం, మాజీ ట్రస్టు బోర్డు చైర్మన్ కంటే బాబు లక్ష్మీదేవి చిత్రపటం వద్ద పూజలు చేసి వ్రతాలను ప్రారంభించారు. వ్రతాల్లో పాల్గొన్న భక్తులకు దేవస్థానం ఆధ్వర్యాన అన్నదానం నిర్వహించారు.

వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ కమిటీల్లో చోటు ˘

వైఎస్సార్ సీపీ రాష్ట్ర అనుబంధ కమిటీల్లో చోటు ˘