ప్రైవేట్ బస్సులపై కేసులు
రావులపాలెం: నిబంధనలు పాటించని ఆరు ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై కేసులు నమోదు చేసి రూ.33 వే అపరాధ రుసుం విధించినట్టు జిల్లా రవాణా అధికారి డి.శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. ఈతకోట టోల్ ప్లాజా వద్ద రవాణా శాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారన్నారు. ఈ సందర్భంగా నిబంధనలు పాటించని బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని డీటీఓ హెచ్చరించారు. అతివేగం, సెల్‌ఫోన్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుపడితే డ్రైవర్‌కి జైలు శిక్ష తప్పదన్నారు. ఈ తనిఖీల్లో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ రాజేంద్రప్రసాద్, ఓలేటి శ్రీనివాస్, షణ్ముఖ శ్రీనివాస్ పాల్గొన్నారు.
కాట్రేనికోన: బలుసుతిప్ప గ్రామంలో రింగు వల వేటగాళ్లు– సంప్రదాయ చేపల వేటగాళ్ల మధ్య ఘర్షణ కోట్లాటకు దారితీసింది. సంప్రదాయ వేటగాళ్లకు టీడీపీ మద్దతు ఇవ్వగా, రింగు వల వేటగాళ్లు జనసేనకు చెందిన వారు కావడంతో కూటమిలో కుమ్ములాటగా మారింది. పూర్వం నుంచీ బలుసుతిప్ప నదీ పాయల్లో చిన్న చేపలు, రొయ్యల ఉత్పత్తికి నష్టం లేకుండా చేపల వేట సాగుతోంది. గ్రామానికి చెందిన వనమాడి మోసయ్య, బందరుకు చెందిన బంధువుతో కలసి సుమారు 20 రోజుల పాటు రింగు వలతో కొత్తపాలెం, భైరవపాలెం మొగ ప్రాంతంలో సముద్ర తీరం వెంబడి వేట సాగిస్తున్నారని ఆరోపణ. చేపల వేట నిషేధం ఉన్నా నాలుగు రోజుల నుంచి చల్ల కాలువ ముక్కాం అంతరం సమీపంలోని గోదావరి పాయలో వేట చేశారు. రింగు వలతో గోదావరిలోని చిన్నా, పెద్దా తేడా లేకుండా చేపలు, రొయ్యలను వేటాడడం సరికాదని సంప్రదాయ వేటగాళ్లు గ్రామ పెద్దలకు చెప్పారు. దీంతో రింగు వల వేట చేయవద్దని వారు మందలించారు. అయితే గేలం వేటను ఆపేస్తే రింగు వలను వేయమని ఆ వర్గం భీష్మించారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య కొట్లాట జరిగింది. సంప్రదాయ వేటగాళ్లకు టీడీపీ నాయకులు మద్దతుగా నిలిచి రింగు వలలను పోలీస్ స్టేషన్‌కు తరలించి కాట్రేనికోన ఎస్సై అవినాష్‌కు ఫిర్యాదు చేశారు.
ఉపశమనం పొందేందుకు..
వేసవిలో బాటసారులకు పుచ్చకాయ ఎంతో ఉపశమనం కలిగిస్తోంది. ప్రయాణ సమయంలో ఎండ వేడికి దాహం, ఉక్కబోత పెరుగుతుంది. ఆ సమయంలో పుచ్చకాయ తింటే దాహార్తిని తీర్చడమే కాకుండా ఉక్కబోత నుంచి ఉపశమనం కలుగుతుంది.
–దాసరి గౌతమ్, ముమ్మిడివరం
ఆరోగ్యానికి మంచిది
పుచ్చకాయ ఆరోగ్యానికి ఎంతో మంచిది. వయసుతో సంబంధం లేకుండా అందరూ తినవచ్చు. కంటిచూపు మెరుగవుతుంది. కిడ్నీలు, గుండెకు మేలు జరుగుతుంది. జుట్టు బాగా పెరుగుతుంది. వేసవి తాపం నుంచి రక్షణ కలుగుతుంది.
–సీహెచ్ ముకుంద, వైద్యాధికారి, పీహెచ్‌సీ, కొత్తలంక


