వ్యాధులు.. కారణాలు
ఫ వేసవిలో అతిసారం సోకకుండా సురక్షితమైన నీటిని మాత్రమే తాగాలి.
ఫ బావులు, బోర్లు, చెరువులు, కాలువల నీటిలో క్లోరిన్ కలిపిన తర్వాతే వాటిని ఉపయోగించాలి.
ఫ తాగునీటిని పరిశుభ్రమైన పాత్రల్లో నిల్వ చేసి, పాత్రలపై మూతలు పెట్టాలి.
ఫ వంట గదిలో ఆహార పదార్థాలపై కోసిన పండ్లు, కూరగాయ ముక్కలపై దుమ్ము, ధూళి, ఈగలు వాలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఫ వేడిగా, తాజాగా ఉన్న ఆహార పదార్థాలను మాత్రమే భుజించాలి.
ఫ ఎండలతో అల్లాడుతున్న ప్రజలు
ఫ జాగ్రత్తలు అవసరమంటున్న వైద్యులు
రాయవరం: భానుడు భగభగలు రేపుతున్నాడు. బయటకు వెళ్తే మంట పుట్టిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు 39 డిగ్రీలకు చేరుకోవడంతో ప్రజలు ఆరోగ్య సూత్రాలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఆహారం, నీటి విషయంలో శ్రద్ధ తీసుకోవాలని అంటున్నారు. శరీరంలో తేమ (నీటి) శాతం తగ్గకుండా చూసుకోవాలని వివరిస్తున్నారు.
వడదెబ్బ లక్షణాలు.. చికిత్స
ఫ వడదెబ్బకు గురైతే తలనొప్పి, తల తిరగడం, ఎండిపోయిన చర్మంతో ఎక్కువ జ్వరం కలిగి ఉండడం, మగత కలవరింతలు, ఫిట్స్, పాక్షిక లేదా పర్తి అపస్మార స్థితిలోకి వెళ్లడం జరుగుతోంది.
ఫ వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ప్రదేశానికి చేర్చాలి. శరీరాన్ని చల్లని నీటితో కడగాలి. ఐస్ ముక్కలను వస్త్రంలో ఉంచి శరీరం అంతా తుడవాలి. చల్లని గాలి తగిలేలా చూడాలి.
ఫ బాధితులకు చల్లని నీరు లేదా ఉప్పు ఇతర లవణాలు కలిసిన నీటిని (ఓఆర్‌ఎస్ ద్రావణం) తాగించాలి.
అతిసారం లక్షణాలు కనిపిస్తే..
ఫ ఒకటి లేక నాలుగు సార్లు నీళ్లతో కూడిన విరేచనాలైతే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుని సంప్రదించి చికిత్స పొందాలి.
ఫ వాంతులు, నీళ్ల విరేచనాలు అవుతుంటే వెంటనే ‘ఓఆర్‌ఎస్’ ద్రావణాన్ని తాగించాలి.
ఫ ఇంటిలో లభించే గంజి, పలుచని మజ్జిగ, పప్పు నీరు, కొబ్బరినీళ్లు పట్టాలి.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఫ వేసవిలో సాధ్యమైనంత వరకూ మధ్యాహ్నం ఎండలో తిరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఫ తప్పనిసరిగా బయటకు వెళ్లాల్సి వస్తే ఉప్పు కలిపిన మజ్జిగ లేదా ఉప్పు కలిపిన పండ్ల రసాలు తాగి వెళ్లాలి.
ఫ తెల్లని దుస్తులు ధరించాలి.
ఫ వేసవిలో మద్యం తాగడం వల్ల రక్తనాళాలు వ్యాకోచించి ఎక్కువ చెమట వచ్చేలా చేస్తాయి. అది విషయ పరిస్థితికి దారి తీస్తుంది.
ఫ ఇంటి ఉష్ణోగ్రతలు తగ్గించేందుకు కిటికీలకు తలుపులకు తెరలను వాడి వేడిని తగ్గించాలి.
ఫ ఎండలో వెళ్లేటప్పుడు గొడుగు, టోపీలు, తల పాగాల్లాంటివి ధరించాలి.


