నేడు మలేరియా నివారణ దినోత్సవం
ఆలమూరు: చిన్న దోమ కుట్టడం వల్లే మలేరియా లాంటి పెద్ద ప్రమాదం సంభవిస్తుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తి సకాలంలో చికిత్స తీసుకోకుంటే ప్రాణాంతకంగా మారుతుంది. సంపూర్ణ పారిశుధ్య చర్యలతోనే దోమల వ్యాప్తిని అరికట్టి మలేరియా మహమ్మారిని తరిమికొట్టవచ్చు. శనివారం ప్రపంచ మలేరియా నివారణ దినోత్సవాన్ని జరుపనున్నారు. కోనసీమ జిల్లాలోని 56 ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో మలేరియా నియంత్రణకు జిల్లా వైద్యారోగ్య శాఖ ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ ఏడాది ఇప్పటి వరకూ ఒక కేసు కూడా నమోదు కాలేదని జిల్లా మలేరియా యూనిట్ చెబుతోంది.
వ్యాధి లక్షణాలు.. వ్యాప్తి
ఫ మలేరియాను రక్త పరీక్ష (ఆర్‌డీ) ద్వారా గుర్తించవచ్చు. ప్లాస్మోడియం జాతికి చెందిన అనాఫిలిస్ దోమ వల్ల ఈ వ్యాధి సోకుతుంది.
ఫ వ్యాధి సోకిన వ్యక్తికి చలి, వణుకుతో కూడిన జ్వరం, ఒళ్లు నొప్పులు ఉంటాయి.
ఫ వ్యాధి నిరోధకశక్లి లేని రోగులు విపరీతమైన తలనొప్పి సంభవించి ఒక్కోసారి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదముంది.
ఫ దోమ కుట్టిన 10 నుంచి 15 రోజుల వ్యవధిలో వ్యాధి లక్షణాలు బయటపడతాయి.
ఫ గిరిజన ప్రాంతాల్లో ఫాల్సిపారం మలేరియా అధికంగా ఉండగా, మైదాన ప్రాంతాల్లో వైవాక్స్ జాతి మలేరియా వ్యాపిస్తుంది.
ఫ దోమలను నివారించడం ద్వారా మలేరియా వ్యాధిని పూర్తిగా అరికట్టే అవకాశం ఉంది.
చికిత్సా విధానం
ఫ మలేరియా సోకిన రోగి 14 రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి.
ఫ మధ్యలో మందులు మానేస్తే వ్యాధి తిరగబెట్టే అవకాశఽం ఉంది.
ఫ ఫాల్సీపారం మలేరియాకు మూడు రోజుల పాటు ఏసీటీ చికిత్స తీసుకోవాలి.
ఈ జాగ్రత్తలు అవసరం
ఫ వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలి.
ఫ ఇంటి పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఫ నిల్వ నీటిలో దోమలు వృద్ధి చెందకుండా పరిసరాలను తరచూ లార్వాసైడ్ క్రిమి సంహారక మందును పిచికారీ చేయాలి.


