కరప: రాష్ట్ర స్థాయిలో జరిగే శాప్ ఫుట్‌బాల్ లీగ్– 2026 పోటీలకు కరప మండలం అరట్లకట్ట ముత్యాల సుబ్బన్న మెమోరియల్ జెడ్పీ హైస్కూల్‌కు చెందిన 10 మంది విద్యార్థినులు ఎంపికయ్యారు. జట్టులో ఆరుగురు ప్లేయర్లుగా, నలుగురు స్టాండ్‌బైగా ఎంపికయ్యారని హెచ్‌ఎం పి.శ్రీనివాస్ కుమార్ శుక్రవారం తెలిపారు. గురువారం కాకినాడ డీఎస్‌ఏ మైదానంలో జిల్లా స్థాయిలో జరిగిన ఎంపికల్లో తమ విద్యార్థినులు అర్హత సాధించారన్నారు. వీరు 27న అనంతపురం జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆయన తెలిపారు. ఎంపికై న క్రీడాకారుల్లో వల్లు అపర్ణ, నక్కా జ్యోష్స్న, కానేటి రిషిక, షేక్ సమీరాబేగం, వాసంశెట్టి సమీరా, సిరివిశెట్టి సృజన, స్టాండ్‌బై ప్లేయర్లుగా పాట్నీడి లక్ష్మితులసి, పచ్చిమాల జెస్సీకా, సింగినీడి నవ్య, పంపన మహాలక్ష్మి ఉన్నారు. ఎంపికై న క్రీడాకారులను, తర్ఫీదునిచ్చిన పీడీ కౌర్‌లను హెచ్‌ఎం శ్రీనివాస్ కుమార్, ఫస్ట్ అసిస్టెంట్ ఫణిశర్మ, ఎంఈఓలు కె.బుల్లికృష్ణవేణి, పి.సత్యనారాయణ, ఎంపీపీ పెంకే శ్రీలక్ష్మి, జెడ్పీటీసీ యాళ్ల సుబ్బారావు తదితరులు అభినందించారు.


