జనన, మరణాలను వారం రోజుల్లో నమోదు చేయాలి | - | Sakshi
Sakshi News home page

జనన, మరణాలను వారం రోజుల్లో నమోదు చేయాలి

Apr 24 2026 6:32 AM | Updated on Apr 24 2026 6:32 AM

అమలాపురం టౌన్‌: జనన, మరణాలను మున్సిపల్‌ కార్యాలయాల్లో వారం రోజుల్లో నమోదు చేయించుకోవాలని మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ డిప్యూటీ డైరెక్టర్‌ (డీడీ) కె.శ్రీనివాసరావు సూచించారు. స్థానిక మున్సిపల్‌ కార్యాలయంలో జనన, మరణాల నమోదు విభాగాన్ని ఆయన గురువారం సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. సిబ్బందికి దరఖాస్తులు అందిన వెంటనే జనన, మరణాలను నమోదు చేసి సర్టిఫికెట్లు జారీ చేయాలని ఆదేశించారు. అలాగే ఆయా రిజిస్ట్రేషన్లను బైండింగ్‌ చేసి భద్రపరచాలని సూచించారు. పట్టణంలోని ఆస్పత్రుల యాజమా న్యాలు సైతం జనన, మరణ వివరాలను సకాలంలో నమోదు చేసి నిర్ణీత సమయంలో మున్సిపాలిటీలోని సంబంధిత విభాగానికి అందజేయాలని సూచించారు. ఇళ్ల వద్ద జరిగే జనన, మరణాలను పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి నమోదు చేయాలని పేర్కొన్నారు. మున్సిపల్‌ స్టాిస్టికల్‌ ఆఫీసర్‌ కె.వీరబాబు, అమలాపురం మున్సిపాలిటీ ఏఎస్‌వో బీఎన్‌ శ్రీనివాసరావు, విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement