సూర్యప్రభ వాహనంపై వీరేశ్వరుడు | - | Sakshi
Sakshi News home page

సూర్యప్రభ వాహనంపై వీరేశ్వరుడు

Apr 23 2026 7:54 AM | Updated on Apr 23 2026 7:54 AM

ఐ.పోలవరం: మురమళ్ల వీరేశ్వరస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా సాగుతున్నాయి. మూడవరోజు బుధవారం కార్యక్రమంలో భాగంగా ఉదయం గవ్యాంతం, సరస్వతి హోమం, స్వామి, అమ్మవార్లకు అభిషేకం నిర్వహించారు. సాయంత్రం సూర్యప్రభ వాహనంపై స్వామివారిని పుర వీధుల్లో ఊరేగించారు. ఆలయ చైర్మన్‌ దాట్ల రామకృష్ణంరాజు, అసిస్టెంట్‌ కమిషనర్‌, కార్యనిర్వాహణాధికారి వి.సత్యనారాయణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ్ర సత్య సీతారామశర్మ ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.

పట్టువస్త్రాల సమర్పణ

అన్నవరం: ఈ నెల 26 నుంచి జరగనున్న సత్యదేవుని కల్యాణోత్సవాల్లో స్వామి, అమ్మవార్లకు అలంకరించేందుకు లక్కీ షాపింగ్‌ మాల్‌ అధినేతలు శ్రీనివాస్‌, సుబ్రహ్మణ్యం, రత్తయ్య (విశాఖపట్నం) రూ.లక్ష విలువైన పట్టు వస్త్రాలను బుధవారం సమర్పించారు. వీటిని ఉపాలయాల్లోని దేవతామూర్తులకు కూడా అలంకరించాలని కోరారు. కార్యక్రమంలో ఏఈఓ కృష్ణారావు, స్థానిక వాసవీ ఆర్య వైశ్య సత్రం అధ్యక్షుడు పేరూరి గాంధీ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement