రొయ్యల సాగు కారణంగా..
వశిష్ట, వైనతేయ, గౌతమీ, వృద్ధ గౌతమీ తీరాల వెంబడి అనేకచోట్ల ఆక్వా సాగు అధికంగా ఉంది. సన్న కారు రైతులు, వివిధ సొసైటీ భూముల సాగుదారులు కలిసి ఉమ్మడిగానో లేక విక్రయాల ద్వారానో పెద్ద చెరువులు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో అప్పటి వరకూ ఈ భూముల రాకపోకలకు గల మార్గాలు మూసుకుపోయాయి. చెరువుల రక్షణ కోసం బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇలా దారులు మూసుకుపోయాయి. బ్రిటిష్ హయాం నుంచీ కూడా ఇక్కడ ఉన్న మార్గాలు సైతం ప్రస్తుత కాలంలో కనుమరుగుకావడం గమనార్హం.
కారణలేంటి?
బ్రిటిష్ కాలంలోని గల మార్గాలు ప్రస్తుతం మూసుకుపోవడానికి కారణాలు ఏంటీ. నది కూడా అనేకచోట్ల కోతకు గురికావడం, ఉన్న జిరాయితీ స్థలాలను రైతులు మూసివేయడం. భారీ నిర్మాణాలు, టూరిజం అభివృద్ధి, ఆక్వా చెరువుల ఏర్పాటు సమయంలో ల్యాండ్ కన్వర్షన్. సీఆర్‌జెడ్ నిబంధనలు సక్రమంగా పాటించకపోవడం వంటి కారణాల వల్ల ఇలా గట్టులపై ప్రజల, ప్రభుత్వాల హక్కులు చేజారిపోతున్నాయి. ఈ నిబంధనలు సక్రమంగా అమలు అయితే ఇటువంటి మార్గాల సమస్యలు ఉత్పన్నం కావు. దారులపై ఏర్పడ్డ ఆక్రమణలను తొలగించాల్సి ఉంది.
● మూసుకుపోతున్న నదులు,
వాగుల ఒడ్డుకు చేరే మార్గాలు
● ఏళ్ల తరబడి యథేచ్ఛగా ఆక్రమణలు
● రొయ్యల సాగు, రియల్ ఎస్టేట్లతో
కనుమరుగువుతున్న దారులు
● ప్రమాదాలు సంభవించినా చేరే మార్గం కరవు
మలికిపురం: కొంతకాలంగా నదీ తీరాలు, సహజ సిద్ధంగా ఏర్పడిన వాగులు, సెలఏర్లు, కాటన్ హయాంలో ఏర్పాటయిన కాలువలు, డ్రైన్‌ల గట్లు కనుమరుగవుతున్నాయి. దారులు మూసుకుపోయి సాధారణ ప్రజలకు నదీ తీరం చూద్దామంటేనే దారి లేకుండా పోతోంది. ఫలితంగా ప్రకృతిని ఆస్వాదించే పరిస్థితి ప్రజలకు లేకుండా పోతోంది. దీనికి కారణం ఎవరు. పర్యవేక్షణ చేయని అధికారులా? లేక మారుతున్న ఆక్వా వంటి వ్యవసాయ విధానంతో పాటు, రియల్ ఎస్టేట్, భారీ నిర్మాణాలా? అంటే ఇవన్నీ కారణాలే! 40 ఏళ్లుగా గోదావరి జిల్లాల్లో ఆక్వా సాగు వల్ల నది పరివాహక తీరాలు, డ్రైన్లు, పెద్ద కాలువల గట్లు కనుమరుగయ్యాయి.
టూరిజంతో మారిన రూపురేఖలు
గోదావరి తీరంలో టూరిజం అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత పరిస్థితులలో వశిష్ట నదీ తీరంలో అనేక మంది ప్రయివేటు రిసార్ట్స్ ఏర్పాటు చేసుకున్నారు. వీటి కోసం నదీ తీరం ఆక్రమించి నిర్మాణం చేయడంతో ఇక తీరానికి వెళ్లే మార్గం లేకుండాపోయింది. ఈ పరిస్థితి వశిష్ట నదీకి ఇరువైపులా అనేకచోట్ల నెలకొంది.
ఆపదల వేళ చేరే
మార్గం కూడా కరవు
ఇక నదులలో, నదీ తీరాలలో ప్రమాదాలు జరిగితే హుటాహుటిన రక్షణ చర్యలు చేపట్టడానికి వెళ్లేందుకు కూడా మార్గాలు లేవు. ఇటీవల కాలంలో దిండి– చించినాడ, పాశర్లపూడి– బొడసకుర్రు, యానాం, ఎదుర్లంక వంతెనల నుంచి పలువురు నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడుతున్న ఘటనలు తలెత్తుతున్నాయి. ఆ సమయాలలో వంతెనల వద్ద నుంచే పడవలతో నదిలోకి వెళ్లి గాలించడం, మృతదేహాలను వెలికితీయడం చేస్తున్నారు. వంతెన నుంచి అనేక కిలోమీటర్ల మేర నదిలోనే ప్రయాణం చేయాల్సి వస్తోంది. కానీ ఏ గ్రామంలోని తీరంలో మృతదేహం ఉన్నా అక్కడికి రోడ్డు మార్గం ద్వారా చేరుకోలేకపోతున్నారు. అందుకు కారణం గతంలో ఉన్న మార్గాలు మూసుకుపోవడమే.
భారీ ప్రమాదాలు సంభవిస్తే..
గతంలో ముంబైలో ఒక సినిమా థియేటర్, హైదరాబాద్‌లో ఒక షాపింగ్ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదాలు సంభవించడంతో దేశంలో ప్రతి థియేటర్, షాపింగ్‌మాల్, విద్యాసంస్థ, స్టేడియంలకు అగ్నిమాపక యంత్రాలు చేరేలా చర్యలు తీసుకున్నాం. కానీ నదులు, క్రీక్‌లలోను, వాటి తీరం వెంబడి భారీ ప్రమాదాలు సంభవిస్తే అక్కడికి చేరేందుకు మార్గం లేదు. అసలే కృష్ణా గోదావరి బేసిన్ ఆయిల్, గ్యాస్ నిక్షేప క్షేత్రాల నిలయం. ఆన్‌షోర్, ఆఫ్‌షోర్‌ల ద్వారా నేరుగా పైప్‌లైన్లు ఈ నదులు, క్రీక్‌ల అడుగు భాగాల నుంచి, జనావాసాల మధ్య నుంచి టూరిజం కేంద్రాల కింద నుంచీ కూడా దేశంలోని గుజరాత్ వంటి ప్రాంతాలకు సైతం వెళ్లాయి. 2014 సంవత్సరంలో నగరంలో గ్యాస్ పైప్‌లైన్ పేలింది. నగరంలోని ఒక డ్రైన్ సమీపంలోనే ఈ ప్రమాదం సంభవించడంతో రక్షణ చర్యలకు ఇబ్బంది పడలేదు. కానీ ఏ నది వద్దనో లేక క్రీక్‌లోనో ఇలాంటి ఘటనలు జరిగితే రక్షణ బృందాలు ఎలా చేరాలి అన్న పెద్ద ప్రశ్న.
నదులు కూడా ఇక్కడ రద్దీగానే ఉంటాయి
గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో పడవ ప్రయాణాలు, పంట్లు, మత్స్యకార బోట్ల రాకపోకలు కూడా అధికంగానే ఉన్నాయి. యానాంతో పాటు బొడసకుర్రు, ఓడలరేవు, అంతర్వేది పల్లిపాలెం ఫిషింగ్ హార్బర్‌ల నుంచి నదులలోకి బోట్లు రాకపోకలు అధికం. స్థానిక మత్స్యకారులు కూడా అధికంగా పడవలలోనే సంచారం చేస్తారు. సఖినేటిపల్లి, ముక్తేశ్వరం, సోంపల్లి రేవుల్లో కూడా ప్రయాణికుల రాకపోకలు అధికం. గడచిన నాలుగేళ్లలో పలుమార్లు నర్సాపురం రేవు నుంచి పంటు ఇంజన్ ఆగి పోయి సముద్రం వైపు రెండు కిలోమీటర్ల మేర వెళ్లిపోయింది. హాహాకారాలు చేయడం ప్రజల వంతు అయింది. ప్రమాదాలు సంభవిస్తే రక్షణ చర్యలకు మార్గాలు లేవు.
కోనసీమ రైల్వే ప్రాజెక్ట్ పూర్తి చేయాలి
ఎంపీ హరీష్‌కు కేఆర్‌ఎస్‌ఎస్ బృందం వినతి
అమలాపురం టౌన్: కోనసీమ రైల్వే ప్రాజెక్ట్ నిర్మాణంలో స్తబ్దతను తొలగించి త్వరితగతిన పూర్తి చేసేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుని వెళ్లాలని అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్‌కు కోనసీమ రైల్వే సాధన సమితి (కేఆర్‌ఎస్‌ఎస్) స్టీరింగ్ కమిటీ ప్రతినిధుల బృందం విజ్ఞప్తి చేసింది. కమిటీ ప్రతినిధి, ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, కన్వీనర్ డాక్టర్ ఈఆర్ సుబ్రహ్మణ్యం తదితరులు ఎంపీ హరీష్‌ను స్థానిక క్యాంపు కార్యాలయంలో మంగళవారం కలిశారు. కోనసీమ రైలు నిర్మాణానికి 26 ఏళ్ల కిందట పునాది రాయి పడినా లైన్‌కు భూసేకరణ, అలైన్‌మెంట్ నిర్ధారణ పూర్తి కాలేదని చెప్పారు. అమలాపురం వరకు భూసేకరణ పూర్తయినా రైల్వే శాఖకు ఆ భూమిని స్వాధీనం చేసి, లైన్ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ చేపట్టకపోవడంపై బృందం ఆందోళన వ్యక్తం చేసింది. కోర్టుల పరంగా సమస్యలు ఉంటే ఆ భూములకు సంబంధించిన రైతులతో చర్చించి పరిష్కరించాలని ఎంపీకి బృందం సూచించింది. ప్రాజెక్ట్ నిర్మాణంలో జరుగుతున్న జాప్యాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లేందుకు నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కేఆర్‌ఎస్‌ఎస్ భావిస్తోందని తెలిపారు. దీనిపై స్పందించిన ఎంపీ హరీష్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో బుధవారం జరగబోయే ప్రజాప్రతినిధుల సమావేశంలో కోనసీమ రైల్వే ప్రాజెక్ట్ పనులపై చర్చిస్తానని హామీ ఇచ్చారు. ఇదే సమావేశంలో ప్రాజెక్ట్‌కు రావాల్సిన రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల విడుదల గురించి ప్రస్తావిస్తానని తెలిపారు. కమిటీ ప్రతినిధులు కల్వకొలను తాతాజీ, బీఎన్ మూర్తి, ఉప్పుగంటి భాస్కరరావు, సప్పా నాగేశ్వరరావు, పోలిశెట్టి శివాజీ, ఎరగర్త వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
కాలువలు, డ్రైన్ల దుస్థితీ ఇంతే..
ఇక గ్రామాలలో ప్రధాన పంట కాలువలూ, డ్రైన్ల దుస్థితి కూడా ఇలాగా ఉంది. అనేకచోట్ల రొయ్యల చెరువులు, రియల్ ఎస్టేట్‌ల కారణంగా వీటి తీరాలకు చేరే మార్గాలు మూసుకు పోయాయి. కూనవరం, శంకరగుప్తం మేజర్ డ్రైన్‌లతో పాటు రాజమహేంద్రవరం వద్ద నుంచి విడిపోయిన అఖండ గోదావరికి గల వివిధ పాయల పరిస్థితి కూడా ఇలాగా ఉన్నట్లు అధికార యంత్రాంగం వద్ద సమాచారం ఉంది. ఇటీవల రైతులు తీవ్రంగా నష్ట పోయి రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసిన శంకరగుప్తం క్రీక్ పూడికతీతకు ఉపక్రమించేందుకు సుమారు 400 ఎకరాలలో ఆక్రమణలు, 150 పైగా అక్రమ నిర్మాణాలు, వేలాది కొబ్బరి చెట్లు అడ్డంకిగా ఉన్నట్టు అధికారులు లెక్కలు తేల్చారు. వీటిని తొలగిస్తేనే గాని ఈ క్రీక్‌నకు రక్షణ గట్టు వేయలేమని చెప్పడం గమనార్హం.
0000705054-000001-AP BP CREDIT SA
10.00x8.00
AP BP CREDIT SALES


