ఎట్టకేలకు బొబ్బర్లంక రోడ్డుకు మరమ్మతులు | - | Sakshi
Sakshi News home page

ఎట్టకేలకు బొబ్బర్లంక రోడ్డుకు మరమ్మతులు

Apr 22 2026 7:24 AM | Updated on Apr 22 2026 7:24 AM

ఆత్రేయపురం : ఎట్టకేలకు ప్రభుత్వం బొబ్బర్లంక రోడ్డుకు మరమ్మతులు మొదలు పెట్టింది. సుమారు రూ.76 లక్షలతో బొబ్బర్లంక రాష్ట్రీయ రహదారి నుంచి వెలిచేరు వరకు, లొల్ల వంతెన సమీపంలో 300 మీటర్లు మేర మరమ్మతులు ప్రారంభించారు. ఈ రహదారి దుస్థితిపై సాక్షి పత్రికలో గత నెల 13వ తేదీన ‘తారుక్కుపోయేలా..’ శీర్షికన వార్త ప్రచురించడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి నిధులు మంజూరు చేయించారు. మంగళవారం బొబ్బర్లంక నుంచి అమ్మవారి గుడి వరకు రోడ్డు వేశారు.

Advertisement
 
Advertisement
Advertisement