ఇది గొల్లవిల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల. రూ.14 లక్షలతో మూడు అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టారు. నిధులన్నీ ఖర్చయిపోయినా గదులు నిర్మాణం పూర్తవలేదు. అదనపు నిధులు వస్తే గాని నిర్మాణం పూర్తయ్యే పరిస్థితి లేదు. పెయింటింగ్, టైల్స్ నిర్మాణం మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. కొత్తగా నిధులు మంజూరు చేస్తే ఆ పనులు కూడా పూర్తవుతాయని ప్రతిపాదన పంపించారు. అయితే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందనే నమ్మకం మాత్రం కలగడం లేదు.
నిధులు లేక పునాదులు
దాటని పాఠశాల
రావులపాలెం మండలం గొపాలపురం మెయిన్ ఎంపీపీఎస్ పాఠశాలలో అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు పునాదులలో నిలిచిపోయాయి. మొత్తం రూ.42 లక్షలు మంజూరు కాగా, రూ.16 లక్షల పనులు పూర్తయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత కేటాయింపులు లేకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు.


