● కళాశీల నుంచి రూ.10 వేల
చొప్పున యజమానుల దోపిడీ
● సర్వే అధికారుల ఖర్చులకు
మరో రూ.200 వసూలు
● ఉదాసీనంగా వ్యవహరిస్తున్న
మత్స్యశాఖ అధికారులు
కాట్రేనికోన: మండలంలో మత్స్యశాఖ చేపట్టిన మత్స్యకార భరోసా లబ్ధిదారుల ఫొటో గుర్తింపు సర్వేలో బోటు యజమానులు కళాశీల నుంచి రూ.10 వేలు, సంబంధిత అధికారుల ఖర్చుల కోసం రూ.200 చొప్పున వసూలు చేస్తున్నారు. ఇలా బోటుకు యజమానితో సహా ఉన్న ఆరుగురి నుంచి రూ.1200 వసూలు చేస్తున్నారు. మండలంలో బలుసుతిప్ప, కొత్తపాలెం, పల్లం, చిర్రయానం తదితర గ్రామాలలో ఫిష్ ల్యాండింగ్ కేంద్రాల వద్ద ఉన్న 1,002 బోట్లను గుర్తించారు. యజమానితో పాటు ఆరుగురు కళాశీల చొప్పున 6012 మంది గుర్తింపునకు సర్వే పూర్తి చేశారు.
మండల పరిధిలోని గ్రామ సచివాలయాలలో పనిచేసి బదిలీపై వెళ్లిన మత్స్యశాఖ సహాయ సిబ్బంది ఇందులో కీలక పాత్ర పోషించారు. ఈ దందాపై అవునా.. అలాగా అంటూ ఏమీ తెలియనట్టు ఆ శాఖ అధికారులు వ్యవహరిస్తున్నారు. స్థానిక ఎఫ్‌డీఓ చలపతిని వివరణ కోరగా సొమ్ము వసూలు చేయాలని ఎవరికీ చెప్పలేదని, బోటు యజమానులు విషయం తన దృష్టికి వచ్చిందన్నారు.


