ఆత్రేయపురం: వినియోగదారులందరికీ సక్రమంగా గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆత్రేయపురం ఎం.ఎస్.ఓ. పి.వెంకటేశ్వరరావు తెలిపారు. సాక్షి పత్రికలో బుధవారం వెలువడిన ’సిలిండర్ డెలివరీ చేయకపోవడంపై ఫిర్యాదు’, వార్తకు స్పందించి ఆయన వివరణ ఇచ్చారు. ఈ మేరకు రాజమహేంద్రవరం లక్ష్మీ తులసి భారత్ గ్యాస్ ఏజెన్సీ యజమానితో చర్చించారు. స్థానిక పోలీస్ ఎస్‌ఐ ఎస్ రాముతో ఫిర్యాదుపై మాట్లాడారు. ఆత్రేయపురంలో గల భారత్ గ్యాస్ ఏజెన్సీ వివాదం ఏర్పడి 2010 నుంయి మూతపడటంతో రాజమహేంద్రవరం లక్ష్మీ తులసి భారత్ గ్యాస్ ఏజెన్సీకి అప్పట్లో 4,823 కనెక్షన్లు బదిలీ చేశారు. ఇటీవల ఆత్రేయపురం భారత్ గ్యాస్ ఏజెన్సీ తిరిగి ప్రారంభం కావడంతో 3,672 గ్యాస్ కనెక్షన్లు తిరిగి అప్పగించారు. ఇంకా 1,152 కనెక్షన్లు అందించాల్సి ఉంది. ఇటీవల ఇరాన్, ఇజ్రాయిల్ యుద్ధం కారణంగా ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా వినియోగదారులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఫిర్యాదుదారుడు ఉందుర్తి మనోహరంతో గ్యాస్ కంపెనీ యజమానితో సిలిండర్‌లు అందించడానికి హామీ ఇప్పించారు. ఇక్కడ సుమారు 120 మందికి పైగా వినియోగదారులకు వెంటనే గ్యాస్ సిలిండర్లు అందించడానికి ఏర్పాట్లు చేస్తామని గ్యాస్ ఏజెన్సీ హామీ ఇచ్చింది. దీంతో మనోహరం ఫిర్యాదును వెనుకకు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌ఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


