ముగిసిన ‘పది’ మూల్యాంకనం | - | Sakshi
Sakshi News home page

ముగిసిన ‘పది’ మూల్యాంకనం

Apr 16 2026 10:12 AM | Updated on Apr 16 2026 10:12 AM

అమలాపురం టౌన్‌: పది రోజులుగా అమలాపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ బుధవారంతో ముగిసిందని డీఈవో పి.నాగేశ్వరరావు తెలిపారు. మొత్తం 1,79,180 పేపర్ల మూల్యాంకనాన్ని నిర్వహించారని పేర్కొన్నారు. ఎస్‌వోలు, సీఎస్‌లు, క్యాంపు ఆఫీసర్లు, ఉపాధ్యాయులు మూల్యాంకనాన్ని విజయవంతం చేశారన్నారు.

శ్రీహరి అరెస్టు అక్రమం

అల్లవరం: తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలసి తిరిగి ఇంటికి వెళ్తున్న వైఎస్సార్‌ సీపీ మీడియా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరిని అరెస్టు చేయడం అక్రమమని మాజీ ఎంపీ చింతా అనురాధ మంగళవారం ఓ ప్రకటనలో విమర్శించారు. కనీసం నోటీసు ఇవ్వకుండా, ఏ స్టేషన్‌కు తీసుకెళ్తున్నారో చెప్పకుండా అరెస్టు చేయడాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. ప్రతి రోజూ కనీసం ఒక వైఎస్సార్‌ సీపీ నేతను అరెస్టు చేయడమే లక్ష్యంగా చంద్రబాబు ప్రభుత్వం పని చేస్తోందని, రాష్ట్రంలో రెడ్‌ బుక్‌ రాజ్యాంగంపై ఉన్న శ్రద్ధ సంక్షేమంపై లేదన్నారు. ఇలాంటి అక్రమాలు, దౌర్జన్యాలకు వైఎస్సార్‌ సీపీ భయపడదన్నారు, అక్రమంగా అరెస్టు చేసిన శ్రీహరిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

పారదర్శకంగా

G‹œ-GÌŒæ çÜÆó‡Ó ˘

అమలాపురం టౌన్‌: జిల్లాలో ఫౌండేషన్‌ లెర్నింగ్‌ (ఎఫ్‌ఎల్‌) సర్వేను పారదర్శకంగా, విజయవంతంగా నిర్వహించాలని సర్వే నిర్వహించే ఫీల్డ్‌ ఇన్వెస్టిగేటర్లకు డీఈవో పి.నాగేశ్వరరావు సూచించారు. స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో బుధవారం జరిగిన ఫీల్ట్‌ ఇన్వెస్టిగేటర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత సర్వే నిర్వహించేందుకు ఫీల్ట్‌ ఇన్వెస్టిగేటర్లకు ట్యాబ్స్‌ను అందజేశారు. అనంతరం డీఈవో మాట్లాడుతూ పబ్లిక్‌ పరీక్షల మాదిరిగా మూడో తరగతి విద్యార్ధులకు పరీక్ష నిర్వహించాలన్నారు. అల్లవరం మండలం బోడసకుర్రులోని ఎంపీపీఎస్‌ నంబర్‌–1, ముమ్మిడివరం మండలం చెయ్యేరు గున్నేపల్లి శివారు నల్లావారిపేట ఎంపీపీఎస్‌, మండపేట మండలం వేములపల్లి ఎంపీపీఎస్‌ నంబర్‌–5, కె.గంగవరం మండలం కూళ్ల శివారు పి.కొంపలు ఎంపీపీఎస్‌ పాఠశాలలను ఎఫ్‌ఎల్‌ సర్వేకు ఎంపిక చేసి నిర్వహిస్తున్నట్లు డీఈవో వెల్లడించారు.

18న జాబ్‌ మేళా

అమలాపురం రూరల్‌: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, వికాస సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 18వ తేదీన అమలాపురం భూపయ్య అగ్రహారంలోని వెంకటేశ్వర డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జాబ్‌ మేళాను నిర్వహిస్తునట్టు కలెక్టర్‌ అర్‌. మహేష్‌కుమార్‌ తెలిపారు. దీనికి సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆయన బుధవారం ఆవిష్కరించారు. ఈ ఉద్యోగ మేళాలో 15 కంపెనీలు పాల్గొననున్నాయని దాదాపు 1,300కు పైగా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి డి.హరిశేషు, వికాస జిల్లా మేనేజర్‌ గోళ్ళ రమేష్‌, స్కిల్‌ డెవలప్మెంట్‌ ప్లేస్‌మెంట్‌ అధికారి కె.రాజేంద్రప్రసాద్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement