సఖినేటిపల్లి: అంతర్వేది సముద్ర తీరంలో బుధవారం స్థానిక మైరెన్ పోలీసులు, సివిల్ పోలీసులు సాగర్ కవచ్ నిర్వహించారు. భారతదేశ సముద్ర భద్రతా వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ సాగర్ కవచ్ నిర్వహిస్తారు. సముద్ర ఆధారిత, అసమాన ముప్పులకు వ్యతిరేకంగా సంసిద్ధతను మెరుగుపరుచుకోవడానికి సాగర్ కవచ్ కీలకంగా ఉంది. మైరెన్ సీఐ నవీన్ నరసింహమూర్తి ఆధ్వర్యంలో మైరెన్ పోలీసులు, సివిల్ పోలీసులు విన్యాసాలను తీరం వెంబడి బీచ్ వద్ద, లైట్‌హౌస్ వద్ద, పల్లిపాలెం మినీ హార్బర్ వద్ద చేశారు.


