అంబేడ్కర్‌ జీవితం స్ఫూర్తిదాయకం | - | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ జీవితం స్ఫూర్తిదాయకం

Apr 15 2026 8:02 AM | Updated on Apr 15 2026 8:02 AM

రావులపాలెం: అంటరానితనం, వివక్షలపై అలుపెరుగని పోరాటం చేసిన డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాల సాధనకు సమష్టిగా కృషి చేద్దామని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. అంబేడ్కర్‌ జయంతిని మంగళవారం జిల్లాలో ఘనంగా నిర్వహించారు. రావులపాలెంలోని వైఎస్సార్‌ సీపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ విగ్రహానికి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావుతో కలిసి జగ్గిరెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కోనసీమ ముఖద్వారం వద్ద జరిగిన జయంతి వేడుకల్లో కేక్‌ కట్‌ చేసి, అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలులు వేసి నివాళులు అర్పించారు. అలాగే ఇందిరా కాలనీలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు కుడుపూడి శ్రీనివాసరావు, ఎంపీటీసీ సభ్యుడు గూటం తిమోతి ప్రకాష్‌రావు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు సాకా ప్రసన్నకుమార్‌, మాజీ డీసీఎంఎస్‌ చైర్మన్‌ సాకా మణికుమారి, మాజీ సర్పంచ్‌లు తాడేపల్లి నాగమణి, సబ్బితి మోహనరావు, బొక్కా కరుణాకరం, రావులపాలెం మాజీ ఉప సర్పంచ్‌ గొలుగూరి మునిరెడ్డి, వైఎస్సార్‌ సీపీ జిల్లా ఎస్సీ సెల్‌ నాయకులు కప్పల శ్రీధర్‌, కోనాల రాజు, వైఎస్సార్‌ సీపీ జిల్లా యాక్టివిటీ సభ్యుడు షేక్‌ వల్లీబాబా, వార్డు సభ్యుడు కోనాల రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

సమానత్వ సాధనకు నాంది

అమలాపురం టౌన్‌: దేశంలో సమానత్వ సాధనకు అంబేడ్కర్‌ నాంది పలికారని వైఎస్సార్‌ సీపీ అమలాపురం నియోజకవర్గ నాయకులు, ప్రజా ప్రతినిధులు అన్నారు. అమలాపురంలోని పలు కూడళ్లలో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహాల వద్ద జయంత్యుత్సవం ఘనంగా నిర్వహించారు. మద్దాలవారిపేటలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పార్టీ నియోజకవర్గ పార్టీ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ పినిపే శ్రీకాంత్‌, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్‌ పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సాయమ్మపేట, గడియారం స్తంభం సెంటర్‌, వడ్డిగూడెంతో పాటు పలు వార్డుల్లో అంబేడ్కర్‌ విగ్రహాలకు పు ష్పాంజలి ఘటించారు. కార్యక్రమాల్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, వంటెద్దు వెంకన్నాయుడు, పార్టీ ఎస్‌ఈసీ సభ్యుడు కుడుపూడి భరత్‌ భూషణ్‌, జెడ్పీటీసీ సభ్యుడు పందిరి శ్రీహరి రామగోపాల్‌, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ రెడ్డి సత్య నాగేంద్రమణి, పార్టీ పట్టణ అధ్యక్షుడు సంసాని బులినాని, పార్టీ రాష్ట్ర, జిల్లా అనుబంధ కమిటీల నాయకులు, అధ్యక్షులు మట్టపర్తి నాగేంద్ర, తిరుకోటి సతీష్‌, ఉండ్రు వెంకటేష్‌, గొవ్వాల రాజేష్‌, నాగారపు వెంకటేశ్వరరావు, దూడల ఫణి, విత్తనాల మూర్తి, మెండు రమేష్‌బాబు, చిట్టూరి పెదబాబు, దొమ్మేటి రాము, కల్వకొలను ఉమ పాల్గొన్నారు.

ఆదర్శప్రాయుడు

అమలాపురం రూరల్‌: మానవ హక్కులు, సమానత్వం, సామాజిక న్యాయం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అంబేడ్కర్‌ ఆదర్శప్రాయుడు అని కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌ అన్నారు. కలెక్టరేట్‌లోని అంబేడ్కర్‌ కాంస్య విగ్రహానికి ఆయన పూలమాలలు అలంకరించి నివాళులర్పించారు. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ సాధికారత అధికారి ఈ.జ్యోతిలక్ష్మీదేవి, ఏవో కె.కాశీ విశ్వేశ్వరరావు, జంగా బాబూరావు, ఇసుకపట్ల రఘుబాబు, డి.రత్నకుమార్‌, వికాస జిల్లా మేనేజర్‌ జి.రమేష్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

అట్టడుగు వర్గాలకు రాజ్యాంగ ఫలాలు

అమలాపురం టౌన్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అందించిన రాజ్యాంగ ఫలాలు సమాజంలోని అట్టడుగు వర్గాలకు చేరాలని జిల్లా ఎస్పీ రాహుల్‌ మీనా అన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనన్న స్ఫూర్తితో, అంబేడ్కర్‌ ఆశయాలతో పోలీస్‌ యంత్రాంగం పనిచేయాలని సూచించారు. స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన అంబేడ్కర్‌ జయంతిలో ఆయన మాట్లాడారు. తొలుత అంబేద్కర్‌ చిత్ర పటానికి ఎస్పీతో పాటు ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్‌, ఎస్పీ కార్యాలయ పోలీస్‌ అధికారులు పూల మాలలు వేసి, సెల్యూట్‌ చేశారు. ఏఆర్‌ డీఎస్పీ సుబ్బరాజు, స్పెషల్‌ బ్రాంచి సీఐ వి.పుల్లారావు, డీసీఆర్‌బీ సీఐ నాగ ప్రసాద్‌, సోషల్‌ మీడియా సీఐ తమ్మినాయుడు, ఏఆర్‌ ఆర్‌ఐలు బ్రహ్మానందం, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

అంబేడ్కర్‌ చిత్రపటానికి సెల్యూట్‌ చేస్తున్న ఎస్పీ రాహుల్‌ మీనా, చిత్రంలో పోలీసు అధికారులు

అమలాపురంలో మాట్లాడుతున్న శ్రీకాంత్‌, చిత్రంలోఎమ్మెల్సీలు సూర్యనారాయణరావు, ఇజ్రాయిల్‌

కలెక్టరేట్‌లో అంబేద్కర్‌ విగ్రహానికి నివాళులర్పిస్తున్న కలెక్టర్‌ మహేష్‌కుమార్‌, అధికారులు

ఫ ఆయన ఆశయాల సాధనకు కృషి చేద్దాం

ఫ వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి

ఫ జిల్లాలో ఘనంగా అంబేడ్కర్‌ జయంతి

Advertisement
 
Advertisement
Advertisement