అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం

Apr 15 2026 8:02 AM | Updated on Apr 15 2026 8:02 AM

అమలాపురం టౌన్‌: జిల్లాలో మంగళవారం నుంచి అగ్నిమాపక వారోత్సవాలు మొదలయ్యాయి. ఈ నెల 20వ తేదీ వరకూ వీటిని నిర్వహించనున్నారు. తొలి రోజు నల్ల వంతెన సమీపంలోని అగ్నిమాపక కేంద్రం వద్ద వారోత్సవాలకు శ్రీకారం చుడుతూ అగ్నిమాపక వాహనాన్ని జిల్లా అగ్నిమాపక దళాధికారి ఎన్‌.పార్థసారథి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా 1926 ఏప్రిల్‌ 14న జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన అగ్ని మాపక అధికారులు ఎస్‌హెచ్‌ సోనికుమార్‌, ఎస్‌హెచ్‌ దంగర్‌ సింగ్‌లను స్మరించుకుంటూ కవాతు నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్‌లో జిల్లా అగ్నిమాపక వారోత్సవాల పోస్టర్లను కలెక్టర్‌ ఆర్‌.మహేష్‌కుమార్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అగ్నిమాపక అధికారి పార్థసారథి, ఎకై ్సజ్‌ అసిస్టెంట్‌ సూపరింటెండెంట్‌ గంట అమర్‌బాబు, ముమ్మిడివరం అగ్నిమాపక దళాధికారి ఎస్‌.నాగేశ్వరరావు, అమలాపురం, ముమ్మిడివరం అగ్ని మాపక కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు.

నేడు ఇంటర్‌

ఫలితాల విడుదల

రాయవరం: ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాలను బుధవారం ఉదయం 10.31 గంటలకు విజయవాడలో మాథ్యమిక విద్యాశాఖ విడుదల చేయనుంది. ఫలితాల పట్ల విద్యార్థులు, ఉపాధ్యాయులతో పాటుగా, తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాయి. జిల్లాల పునర్విభజన తర్వాత మూడవ సారి జిల్లాల వారీగా ఫలితాలను విడుదల చేస్తున్నారు. ఫిబ్రవరి 23న ప్రారంభమైన పరీక్షలు మార్చి 24తో ముగిశాయి.

జిల్లాల వారీగా ఫలితాలు

ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియెట్‌ ఫలితాలను పునర్విభజన జరిగిన జిల్లాల వారీగా ప్రకటించనున్నారు. ఇప్పటికే ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని కూడా పునర్విభజన జరిగిన జిల్లాల వారీగానే నిర్వహించిన విషయం విదితమే. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1.16లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇంటర్‌ ఫస్టియర్‌ 22,500, సెకండియర్‌ 20,608, కాకినాడ జిల్లా నుంచి ఫస్టియర్‌ 22,010, సెకండియర్‌ 20,879, కోనసీమ జిల్లా నుంచి ఫస్టియర్‌ 13,131, సెకండియర్‌ 12,756, పోలవరం జిల్లా నుంచి ఫస్టియర్‌ 2,629, సెకండియర్‌ 2,336 మంది పరీక్షలు రాశారు. ఉమ్మడి జిల్లాలో 160 పరీక్షా కేంద్రాల్లో ఫస్టియర్‌, సెకండియర్‌ పరీక్షలు నిర్వహించారు.

హాస్టల్‌ విద్యార్థులకు

’దివీస్‌’ విరాళం

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు కాకినాడ ఒంటిమామిడికి చెందిన దివీస్‌ ల్యాబ్‌రేటరీస్‌ లిమిటెడ్‌ సంస్థ రూ.3.10 కోట్ల విలువైన వస్తువులను విరాళంగా అందించినట్లు కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేంధిర ప్రసాద్‌ తెలిపారు. మొదటి విడతగా 500 పరుపులను జిల్లాలో గల నాలుగు బీసీ హాస్టల్‌కు అందించేందుకు సిద్ధం చేసిన వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు

Advertisement
 
Advertisement
Advertisement