పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి
రావులపాలెం: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వ దుర్మార్గపు పాలనను, అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వ్యతిరేకిస్తూ రావులపాలెం సోమసుందరరెడ్డి నగర్ (కొత్త కాలనీ)కి చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు ఆ పార్టీని వీడి సోమవారం వైఎస్సార్ సీపీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి కొత్తపేట నియోజకవర్గ పరిశీలకుడు పాటి శివకుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాలనీకి చెందిన మానుపాటి పోసి, మానుపాటి అజయ్, మానుపాటి ఏడుకొండలు, కోసూరి వంశీ, మానుపాటి వంశీ, కావడి అనిల్, కావడి సునీల్, ఈతకోట శివ, ఎస్.కె ఖలీద్, గొలుగూరి బాలు, మహేష్, హేమంత్, కిరణ్ తదితర సుమారు 50 మంది పార్టీలో జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేయడానికి అందరూ కృషి చేయాలన్నారు. పార్టీ కోసం పాటుపడ్డ ప్రతీ ఒక్కరికీ భవిష్యత్తులో సముచిత స్థానం ఉంటుందన్నారు. జెడ్పీటీసీ సభ్యుడు కుడుపూడి శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ బొక్కా ప్రసాద్, పార్టీ మండల కన్వీనర్ బొక్కా కరుణాకరం, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సాకా ప్రసన్నకుమార్, నేతలు గొలుగూరి మునిరెడ్డి, షేక్ వల్లి బాబా, పార్టీ గ్రామ అధ్యక్షుడు కర్రి అశోక్ రెడ్డి పాల్గొన్నారు.


