మోంథా తుపాను పంట నష్టంపై రైతు సేవాకేంద్రం, వీఏఏ, వీఆర్‌ఓ, గ్రామ కార్యదర్శులతో కూడిన బృందంతో సర్వే చేపట్టాం. ఆ నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి, ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకుంటున్నాం. నిధులు మంజూరు కాగానే బాధితులకు పరిహారం అందజేస్తాం.
– ఎంవీ రామారావు,
జిల్లా వ్యవసాయాధికారి, అమలాపురం
పరిహారం అందలేదు
నెలలు గడుస్తున్నా మోంథా తుపాను నష్టపరిహారం అందలేదు. గతేడాది ఇవ్వాల్సిన పరిహారం ఇప్పటి వరకూ ఇవ్వకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఉద్యాన పంటలకు పరిహారం మంజూరు చేయాలి.
– యాతం వెంకటేశ్వరరావు,
ఉద్యాన రైతు, ఆత్రేయపురం,
ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
ఆపద సమయంలో రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. మోంథా తుపాను వల్ల వరి పంట తీవ్రంగా దెబ్బతింది. పంట నష్టాన్ని అంచనా వేసినా ఇప్పటి వరకూ పరిహారం ఊసేలేదు. దీనిపై అధికారులను ప్రశ్నిస్తున్నా సమాధానం చెప్పడం లేదు.
– పిల్లి వెంకన్న, పినపళ్ల, ఆలమూరు మండలం


