సామాజిక సమానత్వానికి ఫూలే కృషి | - | Sakshi
Sakshi News home page

సామాజిక సమానత్వానికి ఫూలే కృషి

Apr 12 2026 2:48 AM | Updated on Apr 12 2026 2:48 AM

అణగారిన వర్గాలకు ఆశాజ్యోతి

వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి

ఘనంగా జ్యోతిరావు ఫూలే

జయంత్యుత్సవం

రావులపాలెం: అణగారిన వర్గాల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహాత్ముడు, సామాజిక సమానత్వానికి మార్గదర్శకుడు జ్యోతిరావు ఫూలే అని వైఎస్సార్‌ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఫూలే జయంతి సందర్భంగా శనివారం రావులపాలెంలోని వైఎస్సార్‌ సీపీ క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి జగ్గిరెడ్డి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా విద్యకు శ్రీకారం చుట్టి, అణగారిన వర్గాలకు విద్యను అందించిన గొప్ప సంస్కర్త ఫూలే అన్నారు. సమాజంలోని కుల వివక్ష, అన్యాయాలపై పోరాడి, సమాన హక్కుల కోసం ప్రజలను చైతన్యపరిచారన్నారు. ఆయన ఆలోచనలు నేటికీ సమాజానికి మార్గదర్శకాలుగా నిలుస్తున్నాయని కొనియాడారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు కుడుపూడి శ్రీనివాసరావు, వైస్‌ ఎంపీపీ బొక్కా ప్రసాద్‌, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్రి నాగిరెడ్డి, మాజీ సర్పంచ్‌లు కర్రి గోవింద కృష్ణారెడ్డి, సబ్బితి మోహనరావు, బొక్కా కరుణాకరం, మాజీ ఉప సర్పంచ్‌ గొలుగూరి మునిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు బొక్కా వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అసమానతలను తొలగించిన సంస్కర్త

అమలాపురం టౌన్‌: సమాజంలో సామాజిక అసమానతలను తొలగించిన సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు ఫూలే అని వైఎస్సార్‌ సీపీ అమలాపురం నియోజకవర్గ ముఖ్యనేతలు అన్నారు. పార్టీ జిల్లా బీసీ సెల్‌ ఆధ్వర్యంలో స్థానిక మున్సిపల్‌ పార్కు వద్ద ఫూలే జయంతి నిర్వహించారు. బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మట్టపర్తి నాగేంద్ర అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ పినిపే శ్రీకాంత్‌, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయిల్‌, మాజీ ఎంపీ, పార్టీ జోన్‌–2 మహిళా విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ చింతా అనురాధ పాల్గొన్నారు. ఆ పార్కు ముఖ ద్వారం వద్ద గల ఫూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్‌ శ్రీకాంత్‌ మాట్లాడుతూ అఖండ అక్షర జ్యోతిని ఫూలే వెలిగించి సమాజాన్ని చైతన్య పరిచారన్నారు. ఎమ్మెల్సీ సూర్యనారాయణరావు మాట్లాడుతూ సమాజంలో విద్యా వ్యాప్తి కోసం అహర్శిశలు శ్రమించిన మహనీయుడు ఫూలే అని కొనియాడారు. మరో ఎమ్మెల్సీ ఇజ్రాయిల్‌ మాట్లాడుతూ సమాజంలో సమానత్వం కోసం ఆయన నిరంతరం శ్రమించారన్నారు. మాజీ ఎంపీ అనురాధ మాట్లాడుతూ అణగారిన వర్గాల ఆత్మ గౌరవానికి ఆద్యుడు ఫూలే అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, వంటెద్దు వెంకన్నాయుడు, పార్టీ ఎస్‌ఈసీ సభ్యుడు కుడుపూడి భరత్‌ భూషణ్‌, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ రెడ్డి సత్య నాగేంద్రమణి, పార్టీ పట్టణ అధ్యక్షుడు సంసాని బులినాని, పార్టీ అనుబంధ కమిటీల రాష్ట్ర, జిల్లా నాయకులు, అధ్యక్షులు జిన్నూరి వెంకటేశ్వరరావు, షేక్‌ అబ్దుల్‌ ఖాదర్‌, ఉండ్రు బాబ్జీ, మద్దింశెట్టి ప్రసాద్‌, సుంకర లక్ష్మి, తిరుకోటి సతీష్‌, భరణికాన బాబు, విత్తనాల మూర్తి, సూదా గణపతి, కముజు రమణ, తోరం గౌతమ్‌ రాజా, ముంగర ప్రసాద్‌, కుడుపూడి త్రినాథ్‌, వాసంఽశెట్ట శ్రీనివాస్‌, కాండ్రేగుల శ్రీనివాస్‌, చిట్టూరి పెదబాబు, ఈతకోట శ్రావణ్‌, నాగారపు వెంకటేశ్వరరావు, కాళే చంటి తదితరులు పాల్గొన్నారు.

యువతకు స్ఫూర్తి

అమలాపురం రూరల్‌: జ్యోతిరావు ఫూలే జీవితాన్ని యువత స్ఫూర్తిగా తీసుకుని, ఉన్నత చదువులతో సమాజ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టరేట్‌ పరిపాలనాధికారి కడలి కాశీ విశ్వేశ్వరరావు అన్నారు. కలెక్టరేట్‌లో మహాత్మా జ్యోతిరావు ఫూలే ద్విశత జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. జిల్లా పౌర సరఫరాల అధికారి అడపా ఉదయ భాస్కర్‌, బీసీ వెల్ఫేర్‌ అధికారి పి.జ్యోతిలక్ష్మి, డీసీఎంఎస్‌ చైర్మన్‌ పెచ్చేటి చంద్రమౌళి, శెట్టిబలిజ కార్పొరేషన్‌ సభ్యులు కడలి వెంకటేశ్వరరావు, కలెక్టరేట్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.

రావులపాలెంలోని వైఎస్సార్‌ సీపీ క్యాంపు కార్యాలయంలోఫూలే చిత్రపటానికి నమస్కరిస్తున్న పార్టీ జిల్లా అధ్యక్షుడు జగ్గిరెడ్డి

అమలాపురంలో ఫూలే విగ్రహానికి నివాళులర్పిస్తున్న కో ఆర్డినేటర్‌ శ్రీకాంత్‌, ఎమ్మెల్సీలు ఇజ్రాయిల్‌, సూర్యనారాయణరావు, మాజీ ఎంపీ అనురాధ

Advertisement
 
Advertisement
Advertisement