మాజీ మంత్రి గొల్లపల్లి
కొత్తపేట: మహిళల్ని కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ఏబీఎన్ రాధాకృష్ణ బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు గొల్లపల్లి సూర్యారావు డిమాండ్ చేశారు. బుధవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ ఏబీఎన్ రాధాకృష్ణ గౌరవప్రదమైన జర్నలిజంలో ఉంటూ సభ్యసమాజం తలదించుకునేలా మాట్లాడారన్నారు. వైఎస్సార్ సీపీ నేతల భార్యలపై సిగ్గులేని వ్యాఖ్యలు చేశారన్నారు. ఇందుకు రాధాకృష్ణ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండే మావిగన్ రాజధానిని వైఎస్ జగన్ ప్రతిపాదించారని, దీనిని అందరూ స్వాగతిస్తున్నారని తెలిపారు. దీనిపై ప్రభుత్వం తన అనుకూల మీడియాలో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయిస్తోందన్నారు. తమ పార్టీ నేతలు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే వారిపై దాడి చేయించారన్నారు.


