మావిగన్‌కు రూ.20 వేల కోట్లు చాలు | - | Sakshi
Sakshi News home page

మావిగన్‌కు రూ.20 వేల కోట్లు చాలు

Apr 9 2026 8:05 AM | Updated on Apr 9 2026 8:05 AM

రాధాకృష్ణ వ్యాఖ్యలు విచారకరం

మలికిపురం: మహిళలను కించపరుస్తూ ఏబీఎన్‌లో కథనాలు ప్రసారం కావడం విచారకరమని దీనికి వేమూరి రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలని పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రుద్రరాజు చిన్నరాజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మలికిపురంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వ పెద్దలను మెప్పించేందుకు ఆయన చేసిన వ్యాఖ్యలు అర్ధరహితమన్నారు. మాజీ సీఎం జగన్‌ ప్రతిపాదించిన మావిగున్‌ కాన్సెప్ట్‌కు ప్రజల నుంచి మంచి ఆదరణ వచ్చిందని ఆయన అన్నారు. దాని నుంచి ప్రజలను మరల్చేలా రాధాకృష్ణ చర్చ నడిపారన్నారు. ప్రస్తుతం కూటమి అమలు చేస్తున్న అమరావతి రాజధానిపై ఆ వర్గాల్లోనే వ్యతిరేకత ఉందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement