పోలీస్‌ పీజీఆర్‌ఎస్‌కు 34 అర్జీలు | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ పీజీఆర్‌ఎస్‌కు 34 అర్జీలు

Apr 7 2026 7:31 AM | Updated on Apr 7 2026 7:31 AM

అమలాపురం టౌన్‌: ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్‌ఎస్‌)కు 34 అర్జీలు వచ్చాయి. ఎస్పీ రాహుల్‌ మీనా, ఏఎస్పీ ఏవీఆర్‌పీబీ ప్రసాద్‌లు తమ చాంబర్ల నుంచి ఈ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులు వివిధ సమస్యలపై వారికి ఫిర్యాదులు అందజేశారు. అర్జీదారులతో ఎస్పీ, ఏఎస్పీలు ముఖాముఖి చర్చించి వారి సమస్యల పరిష్కారానికి ఆయా పోలీస్‌ స్టేషన్ల సీఐలు, ఎస్సైలకు ఫోన్‌ ద్వారా ఆదేశాలు ఇచ్చారు. ఎక్కువగా ఆస్తి తగాదాలు, కుటుంబ వివాదాలకు సంబంధించినవే ఉండటంతో వారికి కౌన్సెలింగ్‌ చేసి, సమస్యల పరిష్కారానికి ప్రయత్నాలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement